"దీన్ దయాళ్ స్పర్ష్ యోజన"

ఫిలాటిలీ స్కాలర్షిప్ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి...

విజయవాడ, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 12:
6 నుండి 9 వ తరగతి విద్యార్థులకు మంచి అకడమిక్ రికార్డ్ కలిగి మరియు ఫిలాటలిని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్న విద్యార్థుల కు కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ నిర్వహించే ఫిలాటలి క్విజ్ & ఫిలాటలి ప్రాజెక్ట్ ఆధారము గా అవార్డు గ్రహీతల కు మొత్తం రూ.6000/- స్కాలర్ షిప్ అందజేస్తారు. 
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలల్లో 6 నుండి 9వ తరగతి విద్యార్థులు పోస్ట్ ఆఫీసులో ఫిలాటలి డిపాజిట్ ఖాతా కలిగి ఉండాలి లేదా పాఠశాలలో ని ఫిలాటలి క్లబ్ లో సభ్యుడి గా ఉండాలి. ఒక అభ్యర్థి తప్పనిసరి గా మంచి ఆకడమిక్ రికార్డ్ కలిగి ఉండాలి. అంటే స్కాలర్ షిప్ కోసము ఎంపిక చేసి సమయములో ఈ సంవత్సరము లో అభ్యర్థి కనీసం చివరి పరీక్షలో 60 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్ పాయింటు స్కోర్ చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : డివిజన్ స్థాయిలో 30 సెప్టెంబర్ 2025 న తపాలా శాఖ ద్వారా ఫిలాటలి క్విజ్ వ్రాత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత 15 రోజుల లోపు ఎంపికైన విద్యార్థులు వారి యొక్క ఫిలాటలి ప్రాజెక్ట్ ను తపాలా శాఖ వారికి అందజేయాలి. ఔత్సాహిక విద్యార్థులు వారి యొక్క ధరఖాస్తులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి చే సంతకం చేయించి 16 సెప్టెంబర్ 2025 లోపు పంపవలెను. ఈ కవర్ పై ఫిలాటలి స్టాంప్ లను అతికించి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను. ప్రైవేట్ కొరియర్స్ ద్వారా వచ్చిన ధరఖాస్తులు స్వీకరించబడవని ఎమ్.నరసింహ స్వామి, సీనియర్ సూపరింటెండెంట్ పోస్టల్ కార్యాలయము,విజయవాడ డివిజన్ వారు తెలిపారు.

About The Author

Related Posts