చిత్తూరులో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

చిత్తూరులో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

తిరుపతి జిల్లా ప్రతి నిధి/చిత్తూరు ఆగష్టు 16 (భారత శక్తి):- జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో  స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం బస్సులో మంత్రి, చిత్తూరు ఎంపీ దగ్గు మళ్ళ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ లు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ లో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 2.6 కోట్లమంది మహిళలు ఆడపిల్లలు ట్రాన్స్ జెండర్ల కు ఐదు రకాల ఆర్టీసీ బస్ సర్వీసులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో  నగర మేయర్ అముద, చుడా చైర్ పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. 

About The Author