ఎంపీ సంతకం ఫోర్జరీ.
- తిరుమల దేవస్థానానికి ప్రత్యేక దర్శనం నిమిత్తం లెటర్ ప్యాడ్ తయారు.
- నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
- వివరాలు వెల్లడించిన నంద్యాల సబ్ డివిజన్ ఏ.ఎస్.పీ. జావళి ఐపీఎస్..

తిరుపతిజిల్లా ప్రతినిధి/నంద్యాల : నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు 14.08.2025 వ తేదిన నంద్యాల టౌన్ తెలుగుపేటకు చెందిన బైరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి తండ్రి నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి యొక్క సంతకమును, వెలుగోడు మండలము, గుంతకందాల గ్రామానికి చెందిన ఇరగబోయిన వెంకటేశ్వర్లు తండ్రి చిన్న పోలయ్య అను అతను ఫోర్జరీ చేసి ఎంపీ పేరున తిరుమల దేవస్థాన ప్రత్యేక దర్శనము లెటర్ ప్యాడ్ తయారు చేసి, నెల్లూరు జిల్లా కొవ్వూరు ప్రాంతానికి చెందిన జగదీష్ అనే వ్యక్తి నుండి రూ. 1500 లు వసూలు చేసి ఫోర్జరీ చేసిన లెటర్ ప్యాడ్ ను ఇచ్చి తిరుమల దర్శనానికి పంపించినాడు. దేవస్థాన అధికారి పీ.ఆర్.ఓ. శంకర్ ద్వారా అందిన సమాచారము మేరకు ఫిర్యాదు ఇవ్వగా నంద్యాల 1 టౌన్ పోలీసు స్టేషన్ నందు క్రైం నెంబర్ : 80/2025 యూ/ఎస్/ 318(4), 336(2), 336(3), 340(2) బీ. ఎన్. ఎస్. గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
