ఘనంగా ఎస్ ఆర్ రంగనాథన్ 133వ జయంతి
శ్రీకాకుళం, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 12: గ్రంథాలయ పితామహుడు ఎస్ ఆర్ రంగనాథన్ 133వ జయంతి స్థానిక గ్రంథాలయము నందు ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజా మాట్లాడుతూ.. సీయామీలి రామ అమృత రంగనాథన్ గణితశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తూ గ్రంథాలయ శాస్త్రాన్ని రచించారన్నారు. గ్రంథాలయంలో పుస్తకాల వర్గీకరణ గ్రంథాలయ పరిపాలనపై క్లుప్తంగా శాస్త్రాన్ని వ్రాశారన్నారు. గ్రంథాలయాల నిర్వహణలో వారి పంచ సూత్రాలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనకాపల్లి ఎలమంచిలి డివిజన్ ఉద్యోగులందరూ పాల్గొని ఎస్ఆర్ రంగనాథన్ సేవల గురించి వివరించారు. ఆయన పుట్టినరోజున జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షుడుగా విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు వి ఆనందరావు, విశిష్ట అతిథిగా అచ్యుత విద్యాసంస్థల కరస్పాండెంట్ పల్లి శేషగిరిరావు పాల్గొన్నారు. వీరితో పాటు విశాఖపట్నం జిల్లా గ్రంధాల శాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు ఆర్ కన్నబాబు, ముఖ్య సలహాదారు జి మురళీకృష్ణ, అనకాపల్లి డివిజన్ గ్రంథాలయ ఉద్యోగులు ఎల్ వి రమణ, (అచ్చుతాపురం,) కే శ్రీనివాసరావు (అనకాపల్లి), కే వరలక్ష్మి (మునగపాక), అప్పలనర్స (గణపర్తి) జగన్ (తాళ్లపాలెం) కే లక్ష్మణరావు (పరవాడ) ఎలమంచిలి డివిజన్ నుండి జనార్ధన్ (చిన్న దొడ్డి గళ్ళు) జి గోవింద్ ఈశ్వరరావు (నక్కపల్లి) ఎస్ శకుంతల దేవి (దిమిలి), వి లక్ష్మణరావు (పాయకరావుపేట) యువకులు, పాఠకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అచ్యుతాపురం ఇన్చార్జి గ్రంథాలయాధికారిగా పనిచేసిన దొడ్డి కోటేశ్వరరావును గ్రంథాలయ ఉద్యోగులు అందరూ ఘనంగా సన్మానించారు.
