మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి మృతి
సిపిఐ నివాళి..
తిరుపతి జిల్లా ప్రతినిధి,ఆగష్టు 12(భారతశక్తి): శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో, అందరికీ ఆప్తుడుగా, రాజకీయాలకు అతీతంగా మెలిగిన మంచి వ్యక్తి తాటిపర్తి చెంచురెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి అన్నారు. ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన స్వగృహం లో చెంచురెడ్డి పార్థీవ దేహానికి సీపీఐ జిల్లా నాయకత్వం ఆధ్వర్యం లో పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ చెంచు రెడ్డి రాజకీయ పరిణితి చెందిన వ్యక్తని, రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి మెలసి ఉండేవారని, నా చిన్నతనంలో నేను కూడా ఆయన రాజకీయాలను గమనించే వాడిని అని చెప్పారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దిక్కుగా ఉండినాడని గుర్తు చేశారు. మంచి వ్యక్తి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన మృతికి సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య,నియోజకవర్గ కార్యదర్శి జనమాలగురవయ్య,పట్టణ కార్యదర్శి ఆర్ గోపి,ఆర్ఎస్ కె మూర్తి,చారులత పాల్గొన్నారు.
About The Author
15 Nov 2025
