పత్రికా కార్యాలయల పై దాడులు అనైతికం
ములుగు జిల్లా ప్రతినిధి :
టీయూడబ్ల్యూజేే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎ.కొమురయ్య

మడికొండలోని నమస్తే తెలంగాణ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడినీ తీవ్రంగా ఖండిస్తున్నామని పత్రికకార్యాలయాలపై దాడులు చేయడం అనైతికమని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎనగందుల కొమురయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏ రాజకీయ పార్టీల, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగోస్థంభంగా ఉన్న మీడియా, పత్రిక విలేకరులపై బెదిరింపులకు దిగటం సరియైనవి కాదని, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్చ పత్రికలకు ఉంటుందని, పత్రికల్లో తమకు వ్యతిరేక వార్తలు వస్తే, వాటిని ఖండిస్తూ వివరణలు ఇవ్వాలే తప్ప , బెదిరింపులకు పాల్పడటం, భౌతిక దాడులకు దిగడం అప్రజస్వామికమన్నారు. పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన దుండగులను వెంటనే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
About The Author
15 Nov 2025
