మహానగర అభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తున్న జీ.హెచ్.ఎం.సి. అవినీతి.. 

- మసకబారిపోయిన ప్రతిష్టాత్మక జీ.హెచ్.ఎం.సి. ప్రతిష్ట.. 
- నగర ప్రజలకు అత్యున్నత సేవలు అందించేందుకు జీ.హెచ్.ఎం.సి. ఏర్పాటు.. 
- అధికారుల అవినీతితో మురికికూపంగా మారిపోయిన వైనం.. 
- సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న జీ.హెచ్.ఎం.సి. యంత్రాంగం.. 
- బర్త్ సర్టిఫికేట్ మొదలు ఇంటి నిర్మాణ అనుమతుల వరకూ లంచాల ప్రసహనం.. 
- ముడుపులు చెల్లించనిదే చలనం లేకుండా పోతున్న అనేక దస్త్రాలు..
- ఎన్ని కథనాలు రాసినా.. ఎన్ని ఆధారాలు చూపించినా ఫలితం శూన్యం..  
- మరీ బరితెగించి ప్రవర్తిస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగ ఉద్యోగులు.. 
- వీరికి చట్టాలంటే లెక్కలేదు.. న్యాయస్థానాలంటే గౌరవం లేదు.. 
- పత్రికలంటే పట్టింపులేదు.. ప్రభుత్వంపై నమ్మకం లేదు.. 
- యథా రాజా తథా ప్రజా అన్న చందాన పరిష్టితులు నెలకొన్నాయి.. 
- ప్రభుత్వాలు అవినీతి మయం అవుతుంటే వీళ్ళెందుకు సక్రమంగా పనిచేస్తారు..
- గ్రేట్ అని చెప్పుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాని వ్యవస్థగా జీ.హెచ్.ఎం.సి. 
- " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక అవినీతి కథనం.. 

WhatsApp Image 2025-08-20 at 17.26.18 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఈ నగరంలో జీవిస్తున్నామని గర్వంగా చెప్పుకోవడం తప్ప.. ఇక్కడి జీవితాలు అగమ్యగోచరంగా ఉంటున్నాయి..  ఇది నమ్మలేని నిజం.. అక్షర సత్యం.. మన జీవన గమనంలో ప్రతి రోజూ ఎదో ఒక ప్రభుత్వపరమైన అంశాలు ఎదురవుతుంటాయి..  ప్రతి చిన్న విషయానికీ అవసరమైన సర్టిఫికెట్లు కావాల్సి వస్తుంది.. ఒక స్థలం కొనాలన్నా.. ఒక్క చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా  ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి.. అయితే జీ.హెచ్.ఎం.సి. అందించే సేవలు మన అవసరాలను సులభతరం చేస్తుంటాయి..  ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితంగా లేక నామమాత్రపు రుషుముతో మనం పొందవచ్చు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.. మనం ప్రతి విషయంలోనూ చెల్లించే పన్నులతో జీత భత్యాలు తీసుకుంటూ మనకు అవసరమైన సేవలు అందించాల్సిన బల్దియా సిబ్బంది గతితప్పి అక్రమ సంపాదనకు మరిగి మన దగ్గర లంచాలు ఆశిస్తున్నారు.. ఇది హేయమైన చర్య.. చట్టపరంగా నేరం కూడా.. అయినాసరే వారి  పద్ధతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.. ఒక ఎవరైనా ఫిర్యాదు చేసినా నేరం నిరూపణ అయినా కేవలం సస్పెండ్ అవుతారు..  తిరిగి విధుల్లో చేరతారు.. కుక్కతోక వంకర అన్నట్లు మళ్ళీ అవినీతి మార్గాన నడుస్తారు.. ఎలాంటి ఫలితం ఉండదు.. లంచాలు తీసుకునే వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించాలి.. కఠినంగా శిక్షించాలి అప్పుడే కొంతైనా మార్పు వస్తుందనే అభిప్రాయం వెల్లడిస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ.. ప్రభుత్వానికి సూచిస్తోంది..  

హైదరాబాద్, ఆగష్టు 19 ( భారత శక్తి ) :      
హైదరాబాద్‌ నగరం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటి. మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి ఐటీ సౌకర్యాలు, రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్న అవకాశాలు.. ఇవన్నీ కలిపి హైదరాబాద్‌ను ఒక ప్రత్యేకమైన స్థాయికి చేర్చాయి. అయితే, ఈ అభివృద్ధి వెనుక ఒక చేదు వాస్తవం దాగి ఉంది. అదే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెరుగుతున్న అవినీతి. వాటిల్లో మచ్చుకకు కొన్ని చూద్దాం.. 

Read More ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నాం

భవన అనుమతులు కావాలంటే లంచం ఇచ్చుకోక తప్పదు : 
జీహెచ్‌ఎంసీ వద్ద భవన అనుమతులు తీసుకోవడం కోసం ప్రజలు నెలల తరబడి తిరగాల్సి వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద అపార్టుమెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు సులభంగా అనుమతులు పొందుతుండటం ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అధికారులకు “లంచం” అందితేనే ఫైళ్లు కదులుతున్నాయన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి.

Read More జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాలు..

కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు :
రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీలు, కాల్వల పనులు వంటి టెండర్లలో కూడా అవినీతి బాగా విస్తరించింది. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కాంట్రాక్టర్లు ప్రత్యేక ప్రాధాన్యం పొందుతుండటం, పనుల నాణ్యత లేకపోవడం వల్ల ప్రజా ధనం వృథా అవుతోంది. వర్షాకాలం వస్తే రోడ్లు చెదిరిపోవడం, వంతెనల దగ్గర నీరు నిల్వ కావడం ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి.. 

Read More సాహితీ రాము స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర

ప్రజల సాధారణ జీవితానికి భారంగా మారుతున్న అవినీతి :
జనన, మరణ సర్టిఫికెట్లు, ఆస్తి పన్ను క్లియరెన్స్, వ్యాపార లైసెన్సులు.. ఇలా చిన్న చిన్న పనులకూ అధికారుల వద్ద లంచం లేకుండా పని జరగడం కష్టమైపోయింది. ఈ కారణంగా సాధారణ ప్రజలకే అదనపు భారమవుతోంది.

Read More నేటి భారతం

చెత్త సేకరణ.. బలైపోతున్న పారిశుధ్యం : 
నగరంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణలో కూడా అవినీతి జోరుగా ఉందని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాహనాలు, కాంట్రాక్టులు, శానిటేషన్ పనుల్లో అవకతవకలు ఉండటంతో నగరానికి శుభ్రత లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

Read More నేను బెంజిలో తిరిగిన గంజికే కనెక్ట్ అవుతా..

పారదర్శకత కావాలని నినదిస్తున్న ప్రజలు :
సామాజిక వేత్తలు గొంతు చించుకుని అరుస్తున్నారు.. జీ.హెచ్.ఎం.సి.లో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉండాలి.
టెండర్లు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చేసి, మధ్యవర్తులు, లంచాలకు తావు లేకుండా చూడాలి. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుని మిగతా వాళ్ళు అవినీతి పదం జపించాలంటే భయపడేలా చేయాలి.. 

Read More చిన్నారులకు గౌన్లను అందజేసిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీలు, మురుగునీటి వ్యవస్థ, భవన అనుమతులు, శానిటేషన్, పార్కులు, వీధి లైటింగ్ వంటి అనేక బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి.. ఈ నిర్వహణను ప్రభుత్వం పర్యవేక్షించాలి.. మరీ ముఖ్యంగా అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వడం, అధిక ఫీజులు వసూలు చేయడం, నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించడానికి సహకరించడం. జరుగుతోంది.. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది..  ప్రభుత్వ భూములు, నలభై అడుగుల రోడ్లపై అక్రమ కట్టడాలు ఏర్పాటుకు అనుమతించడం. అసైన్డ్ భూముల్లో సైతం నిర్మాణ అనుమతులు ఇవ్వడం.. డబ్బు, రాజకీయ పలుకుబడికి జీ.హెచ్.ఎం.సి. దాసోహం అవడం జరుగుతోంది..  దీంతో నగర అభివృద్ధి పనులు నాణ్యత లేని విధంగా సాగుతున్నాయి. రోడ్లు తరచూ పాడవుతున్నాయి. వర్షాకాలంలో నీటిమునిగిన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలకు అసౌకర్యం, ప్రభుత్వ నిధుల వృథా.

Read More జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక కఠిన తనిఖీలు*

హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరమని చెప్పుకోవాలంటే కేవలం రోడ్లు, భవనాలు, ఫ్లైఓవర్లు ఉంటే చాలదు.. నిజమైన అభివృద్ధి అంటే పారదర్శక పాలన. జీ.హెచ్.ఎం.సి.లో పేరుకుపోయిన  అవినీతిని  నిర్మూలిస్తేనే నగరం ప్రజలకు సౌకర్యాలతో పాటు భద్రత, శుభ్రత, అభివృద్ధి కలిగిన నిజమైన "గ్లోబల్ సిటీ"గా నిలుస్తుంది. ఇది ప్రభుత్వాలు గుర్తించాలి.. మేధావుల ఆందోళన, అమాయక ప్రజల ఆవేదన అర్ధం చేసుకోవాలని ఆశిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

Read More విదేశాల్లో బందీ అవుతున్న భారతీయ మేధస్సు..

About The Author

Related Posts