హనుమాన్ జయంతి శోభా యాత్రకు మాజీ మంత్రికి ఆహ్వానం
ఎల్బీనగర్:
ప్రతీ ఏడాది లాగే ఏప్రిల్ 2 గురువారం రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విచ్చేయనున్నారు. ఈ సందర్బంగా వారికి ప్రత్యేక ఆహ్వానాన్ని ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గురువారం సాయంత్రం 4:00 గంటలకు బిఎన్.రెడ్డి.నగర్ చౌరస్తా నుండి సాహెబ్ నగర్ శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయం వరకు శోభా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తి, శక్తి, ఐక్యతకు ప్రతీకగా నిర్వహించే ఈ భవ్య హనుమాన్ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు,మాజీ కార్పొరేటర్లు,పలు డివిజన్ల అధ్యక్షులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
