పేద విద్యార్థులకు సైకిల్ పంపిణి

తిరుపతి జిల్లా ప్రతినిధి,, భారత శక్తి :- స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పాపానాయుడు పేట ఉన్నత పాఠశాల నందు ఉన్న 15 మంది పేద విద్యార్థినీ విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు సైకిల్ ఇవ్వడం చాలా అభినందనీయమని ప్రతి ఒక్క విద్యార్థి దీనిని సక్రమంగా వినియోగించుకొని అందరూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు జ్ఞాన రాధిక మాట్లాడుతూ స్ఫూర్తి ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా సైకిల్స్ పంపిణీ చేయడం చాలా అభినందనీయం. కుక్కలగుంట, ఆర్ వి కండ్రిక గ్రామాల నుండి వచ్చే ట్రైబల్ విద్యార్థులు రోజు 7 కిలోమీటర్లు నుండి రావాలి.ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా సైకిల్స్ ఇవ్వడం వలన వారు ప్రతి రోజు స్కూల్ కి హాజరు అవుతారు అని ఈ కార్యక్రమం పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. అని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ మరుపూరి శేఖర్ మాట్లాడుతూ సైకిల్ పంపిణి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు 15 సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది ప్రతి విద్యార్థిని పాఠశాలకు నిలిచిపోకుండా వెళ్లడానికి మరియు ఆడపిల్లల భద్రత పరంగా కూడా ఉంటుంది అని మా సంస్థ ఉద్దేశం.ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఇంచార్జి తేజోవతి, ప్రముఖ సంఘ సేవకులు చంద్రశేఖర్, స్ఫూర్తి ఫౌండేషన్ టీచర్స్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు సైకిల్ పంపిణి

తిరుపతి జిల్లా ప్రతినిధి,, భారత శక్తి :- స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పాపానాయుడు పేట ఉన్నత పాఠశాల నందు ఉన్న 15 మంది పేద విద్యార్థినీ విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు సైకిల్ ఇవ్వడం చాలా అభినందనీయమని ప్రతి ఒక్క విద్యార్థి దీనిని సక్రమంగా వినియోగించుకొని అందరూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు జ్ఞాన రాధిక మాట్లాడుతూ స్ఫూర్తి ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా సైకిల్స్ పంపిణీ చేయడం చాలా అభినందనీయం. కుక్కలగుంట, ఆర్ వి కండ్రిక గ్రామాల నుండి వచ్చే ట్రైబల్ విద్యార్థులు రోజు 7 కిలోమీటర్లు నుండి రావాలి.ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా సైకిల్స్ ఇవ్వడం వలన వారు ప్రతి రోజు స్కూల్ కి హాజరు అవుతారు అని ఈ కార్యక్రమం పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. అని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ మరుపూరి శేఖర్ మాట్లాడుతూ సైకిల్ పంపిణి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు 15 సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది ప్రతి విద్యార్థిని పాఠశాలకు నిలిచిపోకుండా వెళ్లడానికి మరియు ఆడపిల్లల భద్రత పరంగా కూడా ఉంటుంది అని మా సంస్థ ఉద్దేశం.ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఇంచార్జి తేజోవతి, ప్రముఖ సంఘ సేవకులు చంద్రశేఖర్, స్ఫూర్తి ఫౌండేషన్ టీచర్స్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About The Author

Related Posts