మండల ఏవో నిర్లక్ష్యం… రైతుల పాలిట శాపం

పీఎం కిసాన్ బాధితుల ఆవేదన

మండల ఏవో నిర్లక్ష్యం… రైతుల పాలిట శాపం

దుబ్బాక:

పీఎం కిసాన్ పథకం కింద రావాల్సిన నిధులు రైతులకు అందడం లేదని మండలంలోని పలువురు అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్థానిక వ్యవసాయ శాఖ మండల అధికారి సాయి కిరణ్‌ను పలుమార్లు సంప్రదించినా ఎలాంటి పరిష్కారం చూపలేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘99 ప్రణాళిక’లో భాగంగా ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, తమ సమస్యను పట్టించుకోవడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు హాజరైన సందర్భంగా బాధిత రైతులు కూడా చేరుకొని తమ సమస్యలను వివరించారు. అయినప్పటికీ ఎలాంటి స్పష్టమైన హామీ లేదా స్పందన రాలేదని వారు వాపోయారు.
ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పీఎం కిసాన్ నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

About The Author

Related Posts