పండుగలు ప్రమాదాలు కొనితేవద్దు..

స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్

- ఉత్సవాలు భక్తిగా, ఆహ్లాదకరంగా జరుపుకోవాలి.. 
- బతుకమ్మ, దసరా నవరాత్రులు మొదలైయ్యాయి.. 
- ఊరు ఊరునా, వాడ వాడలా వెల్లివిరిసిన ఆనంద కేళి.. 
- ఆర్భాటాలకు పోవడం ఏ దేవుడూ, ఏ దేవతా హర్షించరు.. 
- ఈ దసరా సెలవులను ఒక జ్ఞాపకంగా మలుచుకోండి.. 
- ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.. వినియోగించుకోండి.. 
- పోలీసులకు, అధికారులకు సహకరించండి.. 
- మద్యపానానికి, మాంసాహారానికి దూరంగా ఉండండి.. 
- ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించండి.. 
- భారత శక్తి పాఠకులకు దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు అందజేస్తోంది 
   " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "   

download

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది.. ఒకవైపు బతుకమ్మ ఆటలతో మహిళలు, యువతులు కనువిందు చేస్తుంటే.. మరోవైపు దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా మొదలైయ్యాయి.. వీధి వీధిలో అమ్మవారి విగ్రహాలతో మండపాలు వెలిశాయి.. పైగా ప్రభుత్వ సెలవులు కూడా కావడంతో ఇంటిల్లిపాది ఈ వేడుకల్లో భాగస్వాములు అవుతున్నారు.. తెలంగాణ ప్రభుత్వం కూడా వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీస్ వారు జాగ్రత్తలు తీసుకున్నారు.. బతుకమ్మ చీరల పంపిణీ కూడా చేస్తున్నారు.. విన్నూత్నంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ప్రజలు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది..    

Read More యోగా క్రీడాకారులకు అభినందన

బతుకమ్మ, దసరా నవరాత్రుల వైభవానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలియజేశారు.. ఇక తెలంగాణ రాష్ట్రం యావత్తూ పండుగల సందడిలో మునిగిపోయింది. బతుకమ్మ, దసరా నవరాత్రులు ప్రారంభమవడంతో నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉత్సాహ వాతావరణం నెలకొంది. సాంప్రదాయ వైభవం, సాంస్కృతిక సొబగులు చాటే ఈ రెండు పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Read More యువకులు క్రీడల్లో రాణించాలి

బతుకమ్మ విశిష్టత :

Read More ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన పెయింటింగ్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు

స్త్రీ శక్తి, ప్రకృతి పట్ల కృతజ్ఞతలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ అంతటా ఘనంగా జరుపుకుంటారు. మహిళలు పూలతో బతుకమ్మను అలంకరించి, పాటలు పాడుతూ, ఊరంతా సంబురంగా ఆడిపాడుతారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడేలా ప్లాస్టిక్‌ పదార్థాలు వాడకూడదని అధికారులు సూచించారు.

Read More చిన్నారులకు గౌన్లను అందజేసిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

దసరా నవరాత్రులు :

Read More గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ శాఖలకు వివిధ నిధులు..

అలాగే శక్తి ఆరాధన పర్వదినాలైన దసరా నవరాత్రులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు అంబాదేవిని వివిధ అవతారాల్లో భక్తులు పూజిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ధర్మం చెడుపై గెలిచిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Read More ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

తీసుకోవలసిన జాగ్రత్తలు :

Read More నేటి భారతం :

సామూహిక వేడుకల్లో గుంపులు ఎక్కువగా ఉండే కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది ప్రభుత్వం.. పిల్లలను కంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూడాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.. ఇక చెరువుల్లో బతుకమ్మ వదిలే సమయంలో నీటి కాలుష్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.. .

Read More లింగంపేట మండలం ఎల్లారాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్

దసరా సందర్భంగా పటాకులు, దీపాల వాడకంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు పలు సూచనలు చేసింది.. 

Read More నేటి భారతం

ప్రభుత్వ ఏర్పాట్లు :

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి..

చెరువులు, సరస్సుల వద్ద ప్రత్యేక ఘాట్‌లు, కాంతివంతమైన లైటింగ్‌ ఏర్పాటు చేశారు.. శానిటేషన్‌ సిబ్బంది ద్వారా శుభ్రత పనులు చేపట్టారు.. వైద్య బృందాలు, అత్యవసర అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచినట్లు తెలియజేశారు.. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పోలీసుల ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.. 

రవాణా సౌకర్యాల కోసం ఆర్.టి.సి. ప్రత్యేక బస్సులు నడుపుతోంది.. సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పోటీలు అధికారుల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతోంది.. మొత్తం మీద రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ, దసరా నవరాత్రులను జరుపుకుంటుండగా, ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

About The Author