వెంటాడుతున్న వైఫల్యాలు.. ( పార్ట్ - 3 )

* రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న సమాచార, పబ్లిక్ రిలేషన్స్ శాఖ..
* ప్రజలకు అత్యుత్తమ సమాచారం అందించే ప్రధాన శాఖ ఇది..
* ప్రభుత్వం ప్రజల కోసం ఏమి చేస్తోంది.. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అన్న విషయాలు ఈ శాఖ ద్వారా తెలుసుకోవచ్చు..
*భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ల ద్వారా ప్రభుత్వం చేసే పనులను ప్రజల ముంగిట్లోకి తీసుకువచ్చే కీలకమైన శాఖ సమాచార శాఖ..
*వివిధ అడ్వర్టైజ్మెంట్ సంస్థలు మీడియా సంస్థలు వార్తాపత్రికల ద్వారా ప్రచారం సాగిస్తారు 
*ప్రకటనలు ఇచ్చే క్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేస్తోంది అన్న విమర్శలు వెళ్ళు వెతుతున్నాయి..
*ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలకు మాత్రమే ప్రకటనలు జారీ చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు..
*ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమిషన్లు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది..
*ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఈ శాఖలో అవినీతి జరిగే అవకాశం లేదంటున్న విమర్శకులు..
*ముఖ్యమంత్రి ఆధీనంలో నడుస్తున్న ఈ శాఖలో అవినీతి భారీ ఎత్తున చోటు చేసుకోవడం దురదృష్టకరం..
*మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా తెలియకుండా అధికారులు మేనేజ్ చేస్తున్నారా..?
*సమాచార అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ నిర్వహణలో లోపాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక కథనం..

WhatsApp Image 2025-11-19 at 4.43.16 PM

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

ప్రభుత్వ పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖ సమాచార మరియు పబ్లిక్ రిలేషన్స్ శాఖ.. ఎందుకు ఈ శాఖ కీలకమైనదిగా చెప్పుకుంటున్నామంటే.. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజా ఉపయోగకర ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు ప్రజల ముంగిటికి తీసుకుని వచ్చే శాఖ ఈ శాఖ.. వివిధ రకాల అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, వివిధ మీడియా ద్వారా, పత్రికల ద్వారా తాము చేసే పనులను ప్రజలకు తెలిసేలా ఈ శాఖ ద్వారా ప్రభుత్వం వెలుగులోకి తీసుకుని వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం.. ఎందుకంటే ప్రజలు కూడా తమకు జరిగే మేలు, తమ అభ్యున్నతి కోసం ఏర్పాటు చేస్తున్న పథకాలు దానికి సంబంధించిన సమాచారం ఆ పథకాలను ఎలా వినియోగించుకోవాలి అన్న విషయాలను కూలంకుషంగా ఈ ప్రకటనల ద్వారా తెలుసుకొనే వెసులుబాటు కలుగుతుంది.. ఇంతవరకు బాగానే ఉంది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దనే ఉంచుకున్నారు.. అయితే ఈ శాఖ పనితీరుపై విమర్శలు వెళ్ళు వెతుతున్నాయి.. ఏ ముఖ్యమంత్రి అయినా తాను చేసే పనులు ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటారు ఇందులో తప్పులేదు.. కానీ చేయని పనులను కూడా అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రజల ముందుకు తీసుకు రావడం తప్పు.. కానీ దురదృష్టం ఏమిటంటే ఇలాంటి వ్యవహారాలు జరుగుతూ ఉండటం.. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభుత్వ ప్రకటనలు అనేవి అన్ని మీడియా సంస్థలకు, అన్ని పత్రికలకు అంటే చిన్న పెద్ద తేడా లేకుండా సమానంగా కేటాయించాల్సి ఉంటుంది.. కానీ ఆ విధంగా జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా వార్తాపత్రికలకు మాత్రమే భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు అన్నది యదార్ధం.. ఇది ఎంత మాత్రం ఆచరణీయం కాదన్నది మేధావుల వాదన.. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మీడియా సంస్థను గాని ఒక పత్రికను కానీ నడపాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని.. చిన్నచిన్న మీడియా సంస్థలకు పత్రికలకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల ద్వారానే అంతో ఇంతో ఆదాయం లభిస్తుంది.. దానితోనే తమ సంస్థలను నడుపుతూ ఉంటారు.. కానీ ప్రభుత్వ తప్పిదాల వాళ్లను ఉన్నతాధికారుల అవినీతి వల్లనో ప్రకటనలు అన్ని పత్రికలకు అన్ని మీడియా సంస్థలకు సమానంగా అందడం లేదు.. దీనితో చిన్న చిన్న సంస్థలు ఎన్నో కష్టాలకు ఆటుపోట్లకు గురి అవుతూ ఉన్నాయి.. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపుల అవినీతి జరుగుతోంది అన్నది నిర్విదాంశం.. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ శాఖను ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో చిన్నచిన్న మీడియా సంస్థల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది.. అదేవిధంగా ప్రభుత్వం చేసే పలు పథకాలు ప్రజల చెంతకు చేరకుండా ఉండే ప్రమాదం కూడా సంభవిస్తుంది.. లేనివి ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఎంతో నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి తన ఆధీనంలో నడుస్తున్న సమాచార అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖను గాడిలో పెట్టాలని విమర్శకులు, మేధావులు, సామాజికవేత్తలు సూచిస్తూ ఉన్నారు..

సమాచార అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ, అంటే ఐ అండ్ పి ఆర్.. శాఖ తెలంగాణలో తన పాత్రని ఏ విధంగా నిర్వహిస్తోంది..? అన్న విషయంపై చర్చ జరుగుతూ ఉంది..

ఐ అండ్ పి ఆర్ శాఖ యొక్క విధులు:

మొదటగా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం: 

ఈ శాఖ ప్రభుత్వ కార్యాచరణలను, పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తుంది.

ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ  మీడియా అంటే పత్రికలు, టీవీ, ప్రసారం వగైరాలతో  సంబంధాలు నిర్వహించి ప్రభుత్వ వార్తలను, మెసేజ్‌లను ప్రచారం చేస్తుంది.

ఫోటోగ్రఫీ, వీడియో కవర్: 

ముఖ్య అధికారులు అంటే వీఐపీలు, వి.వి.ఐ.పి లు, పాల్గొనే కార్యక్రమాలు, సందర్శనలు లాంటి సందర్భంలో ఫోటో, వీడియో కవరేజ్ నిర్వహించడం చేస్తారు..

ప్రచురణలు :

అవసరమైతే ప్రకటనల ప్రచురణలు అంటే బ్రోచర్లు, బ్లూప్రింట్‌లు విడుదల చేయడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచడం జరుగుతుంది..

పత్రికల అక్రిడిటేషన్: 

మీడియా వ్యక్తులకు ప్రెస్ అక్రిడిటేషన్ జారీ చేయడం ఈ శాఖ ద్వారానే జరుగుతుంది..

ప్రజా ఫీడ్‌బాక్: 

జిల్లా స్థాయిలో ప్రజల అభిప్రాయాలను, పాలసీపై స్పందనను సేకరించడానికి ప్రాంతీయ, జిల్లా ప్రజా సంబంధాల అధికారులు నిమగ్నమై ఉంటారు. 

సాంస్కృతిక కమ్యూనికేషన్: 

ప్రదర్శనలు, పాట, నాటకం, స్ట్రీట్ షోలు వంటివి ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఈ శాఖ ద్వారానే ఉపయోగించడం జరుగుతుంది..

సోషల్ మీడియా శిక్షణ: 

పబ్లిక్ రిలేషన్స్ అధికారుల కొరకు సోషల్ మీడియా వాడకంపై శిక్షణ కూడా ఈ శాఖ నిర్వహిస్తూ ఉంది..

సమ్మిళితంగా, ఈ శాఖ “ప్రజా కమ్యూనికేషన్ – ప్రసారం – ప్రజలకు ప్రభుత్వ సమాచారం అందజేయడం” అనే ముఖ్యమైన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంది..

రేవంత్ రెడ్డి పరిపాలనలో అవినీతి ఆరోపణలు :

ఐ అండ్ పి ఆర్ శాఖకు నేరుగా సంబంధించిన అవినీతి చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ..  ప్రధాన పాలనా వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అలాగే ఐ అండ్ పి ఆర్ పవిత్ర కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం అయిందని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయ.. 

అమృత్ టెండర్ స్కాం ఒకసారి చూద్దాం :

బి.ఆర్.ఎస్ నాయకుడు కేటీ రామారావు, రేవంత్ రెడ్డి కుటుంబంపై అమృత్ టెండర్‌లలో స్కామ్ ఉన్నట్లు ఆరోపించారు. 

నేషనల్ హెరాల్డ్ కేసు : 

రేవంత్ రెడ్డి పేరు ఈ డి ఛార్జ్‌షీట్‌లో ఉంది. దీనిపై కేటీ రామారావు తీవ్ర విమర్శలు చేశారు, దీనిని “తెలంగాణ ఏటీఎంగా మార్చేశారు” అని అన్నారు. 

టిడి ఆర్  స్కామ్ ఆరోపణ: 

కేటీ రామారావు  రేవంత్ రెడ్డి పై “వస్తు అభివృద్ధి హక్కుల అంటే టి డి ఆర్ మార్కెట్‌ను నిబంధనలకు  విరుద్ధంగా వ్యవహరించాడనే తీవ్ర ఆరోపణలు చేశారు..

ఈ శాఖపై వస్తున్న ఆరోపణలను రేవంత్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోలేక పోతోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

కాళేశ్వరం ప్రాజెక్ట్: 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దృష్టి పెట్టి, ఆ కేసును సీబిఐ కు అప్పగించేందుకు ప్రకటించారు. 

రిసార్ట్ స్కామ్ ఆరోపణ: 

జీవన్ రెడ్డి అనే మాజీ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై భారీ రిసార్ట్ స్కామ్ దాదాపు రూ. 10,000 కోట్లదాకా, ఆరోపణలు చేశారు.  

అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అన్న విషయాన్ని  వివిధ మీడియా సంస్థలు శాసించే స్థాయిలో ఉండటం గమనార్హం..

ఐ అండ్ పీ.ఆర్. శాఖలో అవినీతి ఉండే అవకాశాలు :
ఐ అండ్ పీ.ఆర్. శాఖసర్వీసు ప్రకారం, ఇది ప్రభుత్వ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ ప్లాన్లు, బడ్జెట్  వ్యవహారాలను ప్రజలకు తెలియజేయడంలో ఇది కీలక సహాయకంగా పనిచేస్తుంది..

అయితే ఐ అండ్ పీ.ఆర్. శాఖను రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించే అవకాశాలు పెరగవచ్చు. ఉదాహరణకి, మీడియా ప్రాధాన్యత ఇవ్వడంలో పక్షపాత ధోరణి కనిపిస్తోంది..

ఇక ఐ అండ్ పీ ఆర్ Iశాఖ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ కమ్యూనికేషన్, ప్రజలకు సమాచారం అందించడంలో ముఖ్యమైన  పాత్రను పోషిస్తోంది.

అయితే అవినీతి ప్రధానంగా ఐ అండ్ పీ ఆర్ శాఖకే కాకుండా ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులు అంటే టెండర్లు, రియల్ ఎస్టేట్ విషయంలో కూడా వెలుగు చూస్తున్నాయి.. 

పారదర్శకత అవసరం: 

ఐ అండ్ పీ ఆర్ శాఖను “ప్రచార యంత్రంగా” కాకుండా నిజమైన సమాచార వనరుగా మార్చడం కోసం ప్రజా పరిపాలనలో మరింత పారదర్శకత, మీడియా స్వతంత్రత అవసరం అని సూచిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"... 

About The Author