వెంటాడుతున్న వైఫల్యాలు..
* రేవంత్ రెడ్డి పరిపాలనకు మచ్చ తెస్తున్న అవినీతి కార్యకలాపాలు..
* ముఖ్యమంత్రి దృష్టికి రావటం లేదా..? వచ్చినా పట్టించుకోవడం లేదా..?
* అన్ని శాఖల్లోనూ విశృంఖలంగా రాజ్యమేలుతున్న అవినీతి..
* ముఖ్యమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండడం ఒక కారణం అవుతోందా..?
* పర్యవేక్షణ లోపం కూడా ఒక కారణం అవుతోందని విశ్లేషిస్తున్న మేధావులు..
* అవినీతికి భారీగా అవకాశం ఉన్న శాఖలన్నీ తన వద్దే ఉంచుకోవడంలో మతలబు ఏమిటి..?
* అవినీతికి తావు లేకుండా చేయడం కోసమా..?
* వేరే ఎవరికీ అవకాశం లేకుండా చేయడం కోసమా..?
* ఇతరులకు ఈ శాఖలను కేటాయిస్తే తనను మించి పోతారని భయమా..?
* ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అనిపించుకుంటున్న రేవంత్ రెడ్డి పరిపాలనలో లోపాలు ఏమిటి..?
* ఎందుకని అధికారులను కట్టడి చేయలేకపోతున్నారు..?
* రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనపై విశ్లేషణాత్మక కథనాన్ని అందిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
2.jpg)
(స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
రేవంత్ రెడ్డి సమకాలీన రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు.. ప్రపంచంలోనే ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన యువ రాజకీయవేత్త.. అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని జవసత్వాలు తీసుకుని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకుని వచ్చిన రాజకీయ వేత్తగా రేవంత్ రెడ్డి ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.. పదేళ్ల టిఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చాడు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అనూహ్యంగా ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సూచించినట్లుగా పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ మాట తప్పకుండా వరుసగా అన్ని పథకాలకు రూపకల్పన చేయడం కూడా జరిగింది.. దాంతో తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి ఒక ఆశాజ్యోతి లా కనిపించాడు.. ఇంతవరకు బాగానే ఉంది.. కొద్ది రోజులు గడిచే కొద్దీ రేవంత్ రెడ్డి డొల్లతనం బయటపడసాగింది.. చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి క్రమేపి వెనుకంజ వేశాడన్నది విశ్లేషకుల వాదన.. మరీ ముఖ్యంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి... ఆ విమర్శలకు అనుగుణంగానే పరిస్థితులు కూడా గోచరించడం కనిపిస్తోంది.. ముఖ్యంగా పరిపాలనలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం, తన ప్రభుత్వ సహచరుల్లో ఎవరిని నమ్మకపోవడం.. కేవలం కమిషన్ల కోసమే కొన్ని పథకాలు రూపకల్పన చేయడం.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. ప్రజా అవసరాలకు అనుగుణంగా కాకుండా పార్టీ పెద్దలు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి నడుచుకోవడం.. ఇలా ఎన్నెన్నో కారణాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి అన్నది అక్షర సత్యం.. పరిపాలనలో ఎంతో మార్పును తీసుకుని వస్తాడు అని భావించిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి కూడా ఒక సామాన్యమైన రాజకీయ వేత్తగా కనిపించడంతో యావత్ ప్రజానీకం ఎంతో నిరాశకు గురయ్యారు.. సామాన్య ప్రజల ఆశలన్నీ గాల్లో కలిసిపోయాయి..
సజావుగా సాగుతున్న రేవంత్ రెడ్డి పరిపాలనలో ముఖ్యమైన శాఖల్లో అవినీతి భారీగా పేరుకుని పోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ తీవ్రమైన చర్చకు దారి తీసింది.. అవినీతి రహిత ప్రజా పాలన అందిస్తానని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మునుపటి ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.. అయితే ఏ శాఖలో అవినీతి భారీగా జరిగే అవకాశం ఉందో ఆయా శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకోవడం ఏమిటి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు.. ఆయా శాఖలను నిర్వహించే సామర్థ్యం ఇతరులకు లేవా..? లేక ఆయా శాఖలు కేటాయించిన వారు అవినీతికి పాల్పడుతారని జాగ్రత్త పడుతున్నారా..? అలాకాకుండా ఆయా శాఖల్లో తాను మాత్రమే అవినీతికి పాల్పడి భారీగా అక్రమార్చన చేయవచ్చు అనే భావనతో రేవంత్ రెడ్డి ఉన్నాడా..? అన్న అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు బహిర్గతం చేస్తున్నారు.. ఏది ఏమైనా ముఖ్యమైన శాఖలన్నీ తన వద్ద ఉంచుకోవడంతో రేవంత్ రెడ్డి రాజకీయ భవితవ్యం పై తీవ్రమైన ప్రభావం చూపుతోందని విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారు..
ఈ విషయాలపై కూలంకుషంగా వాస్తవాలను ఆధారాలతో సహా క్రోడీకరించి వరుస కథల ద్వారా మీ ముందుకు తీసుకుని రానుంది" భారత శక్తి " దినపత్రిక ద్వారా " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
