మరో మహమ్మారి కబళించబోతోందా..?
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- ప్రపంచాన్ని కుమ్మేసిన కోవిడ్..
- అలాంటి ప్రళయం రాబోతోందని సంకేతాలు..
- కారణం తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది..
- ఔషధాల గని వేపచెట్టుకు ప్రమాదం..
- వాతావరణంలో తగ్గనున్న ఆక్షిజన్..
- ఎన్నో ఆయుర్వేద ఔషధాల్లో వేపచెట్టు వినియోగం..
- వేప ఆకులు, చిరును, వేపనూనె, వేపచెక్క ఇలా ఎన్నెన్నో..
- తెగుళ్లతో చనిపోతున్న వేపచెట్లు..
- కోవిడ్ కు ముందు ఇలాగే జరిగింది..
- మళ్ళీ ఆ పరిస్థితులు రాబోతున్నాయన్నది నిపుణుల ఆందోళన..
- ప్రభుత్వం మేలుకోవాలి.. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి..
- ప్రజలు అప్రమత్తం అవ్వాలి.. విలువైన వేప సంపదను కాపాడుకోవాలి..
- మానవాళి సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న వేపచెట్టును కాపాడుకోవాలని పిలుపునిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
.jpeg)
పొద్దున్నే నిద్రలేవగానే వేపచెట్టును దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు.. తెల్లవారుజామున వేపచెట్టునుంచి వచ్చే అత్యంత విలువైన ప్రాణవాయువు ఆక్సిజన్ పీల్చుకుంటే మన శరీర రుగ్మతలు మటుమాయం అయిపోతాయి.. మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.. ఓ రకంగా చెప్పుకోవాలంటే మానవాళి జీవితాల్లో వేపవచెట్టు ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది.. లెక్కలేని ఔషధ గుణాలున్న వేపచెట్టును పరిరక్షించుకోకపోతే.. మనకు రక్షణ కరువవుతుంది.. అన్ని చెట్లల్లోనూ వేపచెట్టు అత్యధికంగా ఆక్షిజన్ ను విడుదల చేస్తుంది.. గాలిలోని ప్రమాదకర సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.. అలాంటి వేపచెట్టు కనుమరుగైపోతే మన పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి.. ఇంతకు ముందే చూసాం.. అప్పట్లో వేపచెట్లు చనిపోవడం మొదలయ్యాక.. ఆ వెంటనే కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది.. లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. కారణం ఆక్షిజన్.. గాల్లో ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో.. అప్పుడు ప్రమాదకర సూక్ష్మ క్రిములు విజృంభిస్తాయి.. అదే జరిగింది.. ఇప్పుడు కూడా అదే జరుగబోతోంది.. వేపచెట్లు వేలసంఖ్యలో చనిపోతున్నాయి.. గాలిలో ఆక్షిజన్ మాయం అయిపోతున్నది.. దీంతో మరో ప్రమాదం ఈ విశ్వాన్ని చుట్టుముట్టబోతోంది అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు, వైద్య నిపుణులు.. ఇలాంటి ప్రమాదం ముంచుకురాకముందే మేలుకోవాలి.. ప్రభుత్వాలు స్పందించాలి.. ఫారెస్ట్, హార్టికల్చర్ శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.. ప్రజలందరూ వేప చెట్లను సంరక్షించుకోవాలి.. అమెరికా లాంటి దేశాలు వేపచెట్టుపై పేటెంట్ హక్కులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు.. అలాంటిది వేపచెట్లకు ఆలవాలమైన భారతావని ఏమి చేస్తోంది..? వేపచెట్లను కాపాడుకోలేకపోతే మన జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
వేపచెట్టు ఎన్నెన్నో విశిష్టతలు కలిగిన మహత్తరమైన వృక్షరాజం.. ప్రకృతికి ఈ చెట్టు ప్రాణాధారము.. వేపచెట్టు వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇక ఔషధ విలువలకు కొదవలేదు.. ఆకులు, చిగురు, వేపనూనె, వేపచెక్క.. ఇవన్నీ ఆయుర్వేద ఔషధాలుగా ఉపయోగిస్తారు. పర్యావరణ ప్రధమ రక్షకుడు వేపచెట్టు.. వేప మొక్క దోమలు, పురుగులు, బ్యాక్టీరియా వంటి వాటిని దూరంగా ఉంచుతుంది. వాతావరణ సమతుల్యతను కాపాడుతుంది.. అధిక వేడి, పొడి వాతావరణంలో కూడా వేప నిలబడగలదు.
భారతీయ సంప్రదాయంలో ఒక భాగంగా నిలుస్తుంది వేప.. వేపతో కలశం, ఉగాది పచ్చడి, ఇంటి ముందు వేపచెట్లు పెంచడం మన జీవనశైలిలో భాగం.
వాతావరణ మార్పులు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.. అసాధారణ వేడి, తేమ తగ్గడం, వర్షాభావం ఇలాంటి పరిస్థితులు వేపను నిర్మూలిస్తున్నాయి.. మరీ ముఖ్యంగా ఫంగల్ వ్యాధులు.. డై బ్యాక్ డిసీజెస్ వంటి ఫంగస్ వేప రంధ్రాల్లోకి ప్రవేశించి చెట్టును చంపేస్తుంది.
దీనికి తోడు మట్టి కాలుష్యం.. ప్లాస్టిక్, రసాయనాల వల్ల వేర్లు దెబ్బతినడం జరుగుతోంది.. అనాలోచిత నిర్మాణాలు సైతం వేపచెట్లను నాశనం చేస్తున్నాయి.. రోడ్లు, భవనాలు, కేబుల్ పనుల సమయంలో వేర్లు కోయడం ప్రమాదకరంగా మారుతోంది.. అవగాహన లోపం కూడా ఒక పెద్ద కారణం అవుతోంది.. వేప విలువ తెలియక నరికివేయడం లేదా దానికి సరైన సంరక్షణ లేకపోవడం విచారకరం..
ఎదురవబోతున్న వినాశనం :
వేపచెట్లు చనిపోతే పర్యావరణ సమతుల్యత భంగం కలుగుతుంది. దోమలు, పురుగులు పెరిగి స్వచ్ఛత సమస్యలు తలెత్తుతాయి.
ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గి, పట్టణాల్లో వేడి పెరుగుతుంది. ఔషధ విలువలతో ఉన్న సహజ రక్షణ కవచం నశిస్తుంది. దీనితో హానికరమైన సూక్ష్మజీవులు ప్రాణం పూసుకుంటాయి.. మనిషి మనుగడను ప్రమాదంలో పడేస్తాయి..
ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల తక్షణ కర్తవ్యం :
వేప సంరక్షణ ప్రాజెక్టు ప్రారంభించాలి.. ప్రత్యేక " నీమ్ కన్సర్వేషన్ మిషన్ అలాగే నీమ్ హెల్త్ సర్వ్ తక్షణమే ప్రారంభించాలి.. వెంటనే ఫంగస్ నియంత్రణ చేపట్టాలి.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఫంగల్ వ్యాధులపై నిపుణుల సలహాతో స్ప్రే ప్రోగ్రాములు చేపట్టాలి. హార్టికల్చర్ శాఖ ప్రత్యేకమైన నివారణ చర్యలు చేపట్టాలి.. నాట్లు వేయడం చేయాలి.. ప్రతి పట్టణంలో, గ్రామంలో వేపనాట్ల కార్యక్రమాలు యుద్ధ పాతిపదికన నిర్వహించాలి. వీటితోపాటు పరిశోధనలు వేగవంతం చేయాలి.. వ్యవసాయ, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు వేప వ్యాధులపై పరిశోధనలు విస్తృతంగా చేపట్టాలి.. నివారణ మార్గాలు కనిపెట్టాలి.. దీనికోసం ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు జారీ చేయాలి..
చట్టపరమైన రక్షణ కల్పించాలి.. :
వేపచెట్లను నరికేవారికి జరిమానాలు విధించాలి.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి. శిక్షలు అమలుచేయాలి.. దీనికోసం ప్రభుత్వం ఒక స్పెషల్ విభాగాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుంది..
ప్రజా అవగాహన :
పాఠశాలలలో, కార్యాలయాల్లో నీమ్ అవేర్నెస్ వీక్స్ లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలి.. నిర్వహించాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి.. వేపచెట్టు విలువ ఏమిటో మేధావులతో చెప్పించాలి.. ప్రజల్లో ఒక బాధ్యతను కలిగించాలి.. తమను తాము రక్షించుకోవడానికి వేపచెట్లను రక్షించాలి అన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయాలి..
ఫారెస్ట్, హార్టికల్చర్ శాఖలు చేయవలసిన పనులు :
వేప వ్యాధుల పరిశీలన చేయాలి.. వాటి నమూనాలు సేకరించాలి.. కారణాలను పరిశోధన చేయాలి.. నివారణకు అవసరమైన ఔషధాలను ఉత్పత్తి చేయాలి.. జీవవైద్య నియంత్రణ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి.. వేప చిగుర్లు నాటడానికి ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేయాలి.. వేపకు అనుకూలమైన నేల, నీటి పరిస్థితులపై అధ్యయనాలు చేయాలి.. ప్రతి ప్రాంతంలో “వేప హెల్త్ రిజిస్టర్” రూపొందించి శాస్త్రీయంగా అమలు చేయాలి..
ప్రజల కర్తవ్యం ఎంతో ముఖ్యం :
ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద వేప మొక్కలు నాటాలి.. నాటిన చెట్లను కాపాడటం కోసం రెగ్యులర్ గా నీరు పోయడం చేయాలి.. ఫంగస్ లేదా వ్యాధి లక్షణాలు గమనిస్తే సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలి.. ప్లాస్టిక్, రసాయనాలు చెట్ల వద్ద వేయకూడదు.
మరీ ముఖ్యంగా పిల్లల్లో వేప విలువపై అవగాహన కల్పించడం చేయాలి.. కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.. వేప నశిస్తే వాతావరణం నశిస్తుంది, వేప నిలిస్తే జీవం నిలుస్తుంది. ఒక వేప చెట్టు.. వేలమందికి ఆరోగ్యాన్నిస్తుంది.. వేపచెట్టు నీడ కేవలం చల్లదనం కాదు, అది ప్రకృతికి ఆశీర్వాదం. అని గ్రహించాలి.. వేపచెట్టు మన ప్రకృతికి రక్షకుడు! అని గుర్తుపెట్టుకోండి.. వేపచెట్లు చనిపోతున్నాయి... ప్రమాదం ముంచుకొస్తోంది.. వేపచెట్టు మన పర్యావరణానికి, ఆరోగ్యానికి, సంప్రదాయానికి జీవాధారంగా నిలిచింది.
అమ్మవారు లాంటి వ్యాధులు కలిగితే వేపాకు దగ్గర పెట్టుకుంటాం.. దుర్గామాత సంబరాల్లో వేపాకు ప్రధాన భూమిక పోషిస్తుంది.. వేపాకు కొమ్మలు తలకింద పెట్టుకుంటే మంచి నిద్ర వస్తుంది.. చక్కర వ్యాధిని వేపాకు తగ్గిస్తుంది.. చర్మమానికి గాయాలైతే వేపాకు పేస్ట్ రాస్తే తగ్గిపోతుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే వేపాకు మానవాళికి అందించే అద్భుత గుణాలు ఎన్నెన్నో ఉన్నాయి..
మనందరం కలసి ముందుకు రావాలి.. వేపను కాపాడుకుంటే వాతావరణాన్ని కాపాడినట్టే.. అసలే కాలుష్యంతో సతమతమవుతున్నాం.. అలాంటిది అంతో ఇంతో రక్షణ ఇచ్చే వేపను కాపాడుకోలేక పోతే పెను ప్రమాదాలు జరుగుతాయి.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన పిల్లలకు పచ్చని భూమిని అందిద్దాం.. దాని కోసం మాతో కలిసి కృషి చేయండి అని ప్రాధేయపడుతోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హైమన్ రైట్స్ సంస్థ "..
