స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ భారీ మోసం..
- వందల కుటుంబాల కష్టార్జితాన్ని దోచుకున్న దొంగలు..
- మూడేళ్ళ క్రితం కంపెనీకి డబ్బులు చెల్లించిన బాధితులు..
- వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన స్పెక్ట్రా..
- ప్లాట్లకు సంబంధించిన పత్రాలు ఇవ్వలేదు..
- రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్న యాజమాన్యం..
- బాధితులు ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేదు..
- పుస్తెలతాళ్లు సైతం కొడవపెట్టి ప్లేటుల కొనుగోలు..
- ప్లాట్లు ఇవ్వకుండా, కట్టిన డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న యాజమాన్యం..
- బాధితుల్లో అధికంగా పేదలు, మధ్యతరగతి వాళ్ళే..
- హెచ్.ఎం.డీ.ఏ. అప్రూవల్ ప్లాట్స్ అంటూ నమ్మించి మోసం..
- పెద్ద ఎత్తున ఏజంట్లను నియమించుకుని అమాయకులకు వల..
- భారీ రిటర్న్స్ వస్తాయని నమ్మబలికిన స్పెక్ట్రా..
- ప్రభుత్వం కలుగజేసుకోవాలంటున్న బాధితులు..
- బాధితుల తరఫున పోరాటానికి సిద్దమైన " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
8.jpg)
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
ప్లాట్ల మాయాజాలంతో మోసానికి బలైన మధ్యతరగతి కుటుంబాలు :
బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం, “మూడేళ్ల క్రితమే డబ్బులు చెల్లించాం, కానీ ఇప్పటి వరకు ప్లాట్ల పత్రాలు ఇవ్వలేదు. తేదీలు మార్చుతూ మోసం చేశారు. చివరికి ఫోన్ కూడా ఎత్తడం మానేశారు,” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఎల్బీనగర్‌లో కార్యాలయం నిర్వహిస్తూ, “ప్రత్యేక ఆఫర్లు, తక్కువ ధరల ప్లాట్లు” అంటూ ప్రజలను ఆకర్షించింది. మొదట ఏజెంట్లకు కమీషన్లు, బహుమతులు, కార్ల వరకు ఇస్తూ విశ్వసనీయతను సంపాదించిన సంస్థ, చివరికి అదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చి పెద్ద ఎత్తున మోసం చేసింది.
బాధితుల ఆందోళనలు.. న్యాయం కోరుతున్న ప్రజలు :
ఇటీవలి రోజుల్లో ఎల్బీనగర్ కార్యాలయం ముందు వందలాది బాధితులు ఆందోళనలు చేపట్టారు. చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఈ మోసానికి బలయ్యారు. “సొంతింటి కల సాకారం అవుతుందనుకున్నాం, కానీ అది ఇప్పుడు అప్పుల బారిన పడింది,” అని వాపోతున్నారు బాధితులు..
మార్యాల జగన్ పేరుతో జరిగిన ప్రచారం.. అసలు వాస్తవం ఏమిటి?
ఈ కేసుల్లో “మార్యాల జగన్” అనే పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే, ప్రస్తుతం లభ్యమైన అధికారిక సమాచారం ప్రకారం ఆయనపై ప్రత్యక్ష ఆరోపణలు లేదా నమోదు చేసిన కేసులు లేవు. దర్యాప్తు సంస్థలు ఇంకా విచారణ కొనసాగిస్తున్నాయి. పోలీసులు, ఆర్థిక నేర విభాగం కొన్ని కీలక వ్యక్తులను గుర్తించి విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కానీ ఫైనల్‌గా నిందితుల జాబితా ఇంకా ప్రకటించబడలేదు.
ప్రభుత్వం కదిలింది.. కేసులు నమోదు :
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్‌పల్లి, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు అయ్యాయి. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో, ప్రభుత్వం కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. మోసానికి పాల్పడినవారిని గుర్తించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు.
బాధితుల హెచ్చరిక :
“ఇకనైనా ఈ రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మన నమ్మకాన్ని మోసం చేసిన వారికి గట్టి శిక్ష తప్పక విధించాలి,” అని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
