హక్కును కాలరాస్తున్నారు..
- అడ్డగోలుగా దుర్వినియోగం అవుతున్న సమాచార హక్కు చట్టం..
- వ్యక్తిగత ప్రతీకార సాధనంగా మారిపోయి ప్రమాదాలకు దారితీస్తోంది..
- బ్లాక్‌మెయిల్‌కు ఆయుధంగా వాడబడుతుండటం గర్హనీయం..
- పారదర్శకత కోసం తెచ్చిన చట్టం, వ్యక్తిగత స్వార్థం కోసమా..?
- సమాచారం అడగడం హక్కు.. ఆ హక్కును ఎవరు కాపాడుతున్నారు..?
- సమాచార హక్కు బాధ్యతగల ఒక పౌరుని ఆయుధం..
- ఒక సత్యాన్ని వెలుగులోకి తెచ్చే సాధనం ఆర్.టి.ఐ.
- సమాచార హక్కు చట్టం పౌరులకు కవచం.. కానీ దాన్ని కొందరు కత్తిలా వాడుతున్నారు..
- ప్రజా ప్రయోజనం కోసం అడిగే సమాచారం గొప్పది..
- అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా తిప్పుతున్న అధికారులు..
- నిర్లక్ష్యం వహించిన అధికారులకు జరిమానాలు, శిక్షలు..
- ఇంత జరుగుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు..
- సమాచార హక్కు చట్టంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు సిద్ధం అవుతోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
.jpeg)
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, విద్యుత్ సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ పాఠశాలలు వంటి అన్ని పబ్లిక్ అథారిటీస్ వద్ద నుండి సమాచారం నిర్భయంగా కోరవచ్చు. 30 రోజుల్లో సమాధానం, సమాచారం ఇవ్వడం తప్పనిసరి.. ఒకవేళ అడిగిన సమాచారం ఇవ్వకపోతే లేదా ఆలస్యం అయితే సంబంధిత అధికారులు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు..
ప్రతి శాఖలోనూ ఒక సమాచార అధికారి ఉంటారు.. వీరీ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తుంటారు.. ఇందులో అపీల్ హక్కు అనేది ముఖ్యమైనది.. మొదటి అపీల్, రెండవ అపీల్ ద్వారా ప్రజలు తమ హక్కును రక్షించుకోవచ్చు. కోరిన సమాచారాన్ని పొందవచ్చు..
సంబంధిత అధికారులు అడిగిన సమాచారం ఇవ్వకపోతే రూ. 250 ప్రతీ రోజు జరిమానా, గరిష్ఠంగా రూ. 25,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.. కానీ ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం దురదృష్టం..
ఉపయోగాలు ఎన్నెన్నో ఉన్నాయి :
అనేక ప్రభుత్వ శాఖలలో బ్లాక్ మనీ, టెండర్ లోపాలు, ఫేక్ బెనిఫిషియరీలు ఈ చట్టం ద్వారా బయటపడ్డాయి. అదేవిధంగా అధికారులు ఆర్.టి.ఐ. వస్తుంది.. అని భయంతో జాగ్రత్త పడుతున్నారు. ఇక అవగాహన ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజలు రేషన్ కార్డు, పెన్షన్, హౌసింగ్, పథకాల్లో తమ హక్కు పొందేందుకు ఆర్.టి.ఐ.ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ చట్టం మీడియాకు బలమైన ఆయుధంగా మారిపోయింది.. జర్నలిస్టులు అనేక స్కాంలను ఆర్.టి.ఐ. ఆధారంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి.. అదేవిధంగా పారదర్శకత పెరిగింది.. కొంతమేర ప్రభుత్వ చర్యలు ప్రజల కంటికి అందుబాటులోకి వచ్చాయి.
దుర్వినియోగం అవుతున్న చట్టం :
అయితే, ఈ చట్టాన్ని కొంతమంది బ్లాక్‌మెయిల్ టూల్ లాగా వాడుతుండటం శోచనీయం.. వ్యక్తిగత పగల కోసం ఆర్.టి.ఐ. వేస్తున్నారు.. అంతే కాకుండా ఉద్యోగులపై, సిబ్బందిపై కక్ష సాధించడానికి కొందరు అపారమైన ఆర్.టి.ఐ. లు వేస్తున్నట్టు తెలుస్తోంది..
ఈ క్రమంలో బ్లాక్‌మెయిల్ మాఫియా కూడా ఏర్పడింది.. కొందరు ఆర్.టి.ఐ. ద్వారా ఫైల్ తీసుకుని, ఆ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండాలంటే తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇందులో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు.. పొలిటికల్ లీడర్స్ ఉన్నారు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.. దురదృష్టం ఏమిటంటే ఆర్.టి.ఐ. వేస్తా.. తర్వాత మీ ఇష్టం అనే బెదిరింపులతో సొసైటీలో ఎన్నెన్నో అవరోధాలు కలుగుతున్నాయి.. ప్రభుత్వ పనితీరు కూడా స్తంభించిపోతుంది. అలాగే ప్రతీ చిన్న విషయం కోసం ఆర్.టి.ఐ. వేసి, అధికారులు దానికి సమాధానం ఇవ్వడంలో సమయం వృధా చేస్తున్నారు.
ఇక ఫేక్ పేర్లతో దరఖాస్తులు వస్తుండటం కూడా జరుగుతోంది.. అసలు వ్యక్తి గుర్తింపు లేకుండా ఆర్.టి.ఐ. వేయడం వల్ల చట్టబద్ధత అనేది లేకుండాపోతోంది..
ప్రభుత్వ చర్యలు :
ప్రభుత్వం కూడా ఈ దుర్వినియోగం నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకుంటోంది.. అందులో ఆర్.టి.ఐ. సవరణ చట్టం, 2019 ఒకటి.. ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పదవీకాలం, వేతనం వంటి అంశాలను నియంత్రించింది. అయితే కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేంద్రానికి అధిక నియంత్రణ ఇచ్చింది, తద్వారా స్వతంత్రత తగ్గింది. కేంద్రం, రాష్ట్రాలు ఆర్.టి.ఐ. ని ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి సదుపాయం కల్పించాయి. ఇక ఆర్.టి.ఐ. వేయకుండా, ప్రభుత్వ శాఖలు తాము స్వయంగా సమాచారం విడుదల చేయాలనే నిబంధన కూడా తీసుకుని వచ్చారు.. కానీ అది అమలులో నోచుకోవడం లేదు..
ఆర్.టి.ఐ. చట్టం ప్రజా పారదర్శకతకు ఆయుధం, కానీ పరిపాలనలో విఘాతం సృష్టించే స్థితికి చేరింది. ప్రభుత్వం స్వతంత్ర కమిషన్ల స్వేచ్ఛను తగ్గిస్తూ, సమాచార నియంత్రణ వాతావరణం సృష్టిస్తోంది. అసలు ఆర్.టి.ఐ. చట్టాన్ని తుడిచిపెట్టడానికి గత బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం ప్రయత్నం చేసి విఫలమైన విషయం తెలిసిందే.. కాగా కొంతమంది ఆర్.టి.ఐ. యాక్టివిటిస్టులు తమ జీవితాలను కోల్పోయారు.. అవినీతిని బయటపెట్టినందుకు హత్యలు కూడా జరిగాయి. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచికలుగా చెప్పవచ్చు..
ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వాములైన ప్రజలు తమను పాలించే ప్రభుత్వాలు, తమ టాక్సులతో జీతాలు తీసుకుని సేవ చేయాల్సిన, అధికారుల అవినీతిని, తమకు అందుతున్న ఫలితాల గురించి తెలుసుకునేందుకు తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం భ్రష్టుపట్టిపోతోంది.. ఇంత అద్భుతమైన చట్టాన్ని సజావుగా కొనసాగించడానికి ఇటు ప్రభుత్వాలు కానీ, అటు అధికారులు కానీ సంసిద్ధంగా లేకపోవడం దురదృష్టం..
దీనికి సంబంధించిన కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.. అడిగిన సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా విధించబడింది..
నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా విధించింది. సమాచార హక్కు చట్టం అమలులోనిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్ అయ్యింది.. వారికి జరిమానాలు విధించింది.. బాగానే ఉంది కేవలం జరిమానాలు విధించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని విశ్లేషకులు వాదిస్తున్నారు.. సరైన సమాచారం అందించని పక్షంలో సంబంధిత అధికారులను విధులనుండి బహిష్కరించాలి.. చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలని యావత్ తెలంగాణ ప్రజానీకంతో బాటు " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " డిమాండ్ చేస్తోంది..
