విషతుల్యంగా మారుతున్న హైదరాబాద్ వాతావరణం.

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- భావితరాలు పెను ప్రమాదంలో పడబోతున్నాయి.. 
- మన నగరాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిన బూనుదాం..  
- ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది.. 
- ప్రభుత్వ విధులు సక్రమంగా జరగడానికి సహకరిద్దాం.. 
- మన నగరాన్ని కాపాడుకోవాలన్సిన కర్తవ్యాన్ని గుర్తిద్దాం.. 
- నీరు కాలుష్యం అవుతోంది.. వాయువు కాలుష్యం అవుతోంది.. 
- చెత్త నిర్వహణలో అంతులేని లోపాలు కనిపిస్తున్నాయి.. 
- కాంట్రాక్టర్లు, జీ.హెచ్.ఎం.సి. సిబ్బంది కలిసి చేస్తున్న నేరం.. 
- చెత్త వాహనాల విషయంలోనూ అంతులేని అవినీతి.. 
- ఏమీ చేయకపోయినా చేసినట్లు బిల్లులు.. దానికి అధికారుల వత్తాసు.. 
- లంచాల మత్తులో పడి.. నగరాన్ని నాశనం చేస్తున్న దుర్మార్గం.. 
- ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

download (1)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నేటి రోజుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంగా నిలుస్తోంది. అయితే ఈ అభివృద్ధి వెనుక ఒక గంభీరమైన సమస్య ముంచుకుని వస్తోంది.. అది విషతుల్యమైన వాతావరణం. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, చెత్త నిర్వహణలో లోపాలు, వాహనాల సంఖ్య పెరుగుదల, పారిశ్రామిక కాలుష్యం మొదలైనవి నగరంలోని పర్యావరణ సమతౌల్యానికి భంగం కలిగిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నా అది కూడా అవినీతి మురికితో నిండిపోయింది అన్నది బహిరంగ వాస్తవం.. అడ్డదిడ్డంగా ఏర్పాటు చేస్తున్న కెమికల్ కంపెనీలకు ఎంతో సుళువుగా అనుమతులు లభిస్తున్నాయి.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి.. వాటిద్వారా విపరీతమైన విషవాయువులు వెలువడుతున్నాయి.. ఆ కంపెనీల నుండి వెలువడుతున్న రసాయనాలు కలిసిన నీరు  నగరమంతా వ్యాపిస్తోంది.. దీంతో తాగునీరు కూడా విషతుల్యం అవుతోంది.. అలాగే ఎంతో సారవంతమైన నెల నిస్సారంగా మారిపోతోంది..  ఇన్ని కాలుష్యాలతో నగర ప్రజల ఆరోగ్యం అనారోగ్యం పాలవుతోంది.. దీనికి కారణం ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, లంచాలతో నిర్మించుకున్న పరిశ్రమలు.. చివరికి ప్రజలు కూడా కారణభూతులవుతున్నారు.. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి..  అప్పుడే ఆరోగ్యవంతమైన, స్వచ్ఛమైన నగరంగా మారిపోతుంది.. 

Read More జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపు పూర్తి..

 
నగర వాతావరణం విషతుల్యమవడానికి అనేక కారణాలు ఉన్నాయి..  వాహనాల విపరీత పెరుగుదల ఒక కారణం.. రోజుకు లక్షల సంఖ్యలో వాహనాలు రహదారులపై తిరుగుతుండడంతో, కార్బన్ మోనో ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డైఆక్సైడ్ వాయువులు వాతావరణంలో కలిసిపోతున్నాయి.. 

Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ

పారిశ్రామిక కాలుష్యం మరోకారణం.. నగర పరిసర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు తగిన శుద్ధి పద్ధతులు పాటించకుండానే వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. మొక్కలు అనవసరంగా నరికివేయడం మరో కారణం.. రహదారి విస్తరణ, నిర్మాణాలు మొదలైన కారణాలతో చెట్ల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గుతోంది.

Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ

ఇక ప్లాస్టిక్,  చెత్త సమస్య విపరీతమవుతోంది.. ప్లాస్టిక్ వ్యర్థాలను తగిన విధంగా వదలకపోవడం వలన నేల, నీటి నాణ్యత దెబ్బతింటోంది.
దీంతో నగర ప్రజల జీవనం ప్రమాదంలో పడిపోతోంది.. 

Read More పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి. సురేష్

నివారణ చర్యలు :

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటడం, దాన్ని సంరక్షించడం చేయాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం క్రమబద్దీకరించాలి.. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, మెట్రో, బస్సులు వంటి సామూహిక రవాణా పద్ధతులను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ ఖచ్చితంగా విధించాలి.. ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలి. చెత్త వేరు చేసి పారవేయడం విధిగా పాటించాలి.. డ్రై, వెట్ వ్యర్థాలను వేరు చేయాలి.

Read More పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

పరిశ్రమల శుద్ధి కేంద్రాలు : 

Read More బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పరిశ్రమల నుంచి వచ్చే మాలిన్యాలను శుద్ధి చేసి విడుదల చేయాలి. విధి విధానాలు పాటించని ఫ్యాక్టరీలను నిర్ద్వందంగా మూసివేయాలి.. అలాంటి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిన అధికారులను డిస్మిస్ చేయాలి.. ముఖ్యంగా ప్రభుత్వం కళ్ళు తెరవాలి.. 

Read More డీసీ వంశీకృష్ణకు వినతిపత్రం అందించిన రాక్ టౌన్ వెల్ఫేర్ సోసైటీ కార్యవర్గ సభ్యులు

ప్రజలు తమ కర్తవ్యాన్ని గుర్తించాలి :

Read More చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయితి కార్యాలయంలో నామినేషన్స్

పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి.. చెత్తను రోడ్లపై వేయకుండా తగిన డస్ట్‌బిన్స్‌లో వేయడం చేయాలి.. విద్యుత్, నీరు వంటి సహజ వనరులను పొదుపుగా వినియోగించాలి..  ప్రభుత్వ పర్యావరణ కార్యక్రమాలకు సహకరించడం చేయాలి.. పచ్చదనం పెంచడంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి.. 

Read More క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం

ప్రభుత్వ కూడా ఖచ్చితంగా కొన్ని విధులు పాటించాలి :

కాలుష్య నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి..  వాతావరణ నాణ్యతను కొలిచే పరికరాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పథకాలు ప్రవేశపెట్టడం. చెత్త నిర్వహణ, నీటి శుద్ధి ప్రాజెక్టులను విస్తరించడం.
పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చేయాలి.. ముఖ్యంగా అవినీతిని సంపూర్తిగా అంతం చేయాలి.. 

ఇక చివరగా..  హైదరాబాద్ అభివృద్ధి పర్యావరణానికి విరుద్ధంగా కాకుండా, సహజ సమతౌల్యాన్ని కాపాడే దిశలో సాగాలి. పర్యావరణాన్ని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటం. అందుకే ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేసినప్పుడే ఈ మహానగరం మళ్లీ 
“పచ్చని హైదరాబాద్”గా మారుతుందని విజ్ఞప్తి చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

About The Author