నిర్మల్ జిల్లా గిరిజన సంక్షేమ నాల్గవ తరగతి ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

నిర్మల్ జిల్లా గిరిజన సంక్షేమ నాల్గవ తరగతి ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

నిర్మల్:

నిర్మల్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల అభివృద్ధిలో నాల్గవ తరగతి ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఉద్యోగులు తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ శాఖ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు కెబిసి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోల వసంత్, కోశాధికారి రమేష్‌తో పాటు శ్రీకాంత్, రాజశేఖర్, సుభాష్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు

About The Author

Related Posts