గ్రామ పాలన అధికారులకు క్లస్టర్లకు నియామక ఉత్తర్వులు..
ఉత్తర్వులను అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి :

వివిధ క్లస్టర్లకు కేటాయించిన గ్రామ పాలన అధికారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ క్లస్టర్లకు కేటాయించిన నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మిమ్ములను ఇతర శాఖల నుండి మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకొని విధులను అప్పగించడం జరిగిందని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మీకు కేటాయించిన క్లస్టర్లలో రెవెన్యూ విధులు సక్రమంగా నిర్వహించి ప్రభుత్వ భూముల సంరక్షణ, భూభారతి చట్టం అమలు, ఇతర రెవెన్యూ శాఖ సంబంధించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో వీణ, కలెక్టరేట్ ఏవో సయ్యద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
06 Dec 2025
