సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అద్వితీయం

మల్కాజ్‌గిరి సీపీ అవినాష్ మొహంతి

సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అద్వితీయం

ఉప్పల్:

 సమాజంలో మహిళలు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమని, అంకితభావం, నిబద్ధత ఉంటే వారు ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించగలరని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉప్పల్‌లోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్‌లో మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ప్రతి రంగంలోనూ సత్తా:

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. స్త్రీలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని, నేడు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టి పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని కొనియాడారు. పోలీసు విభాగంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇన్వెస్టిగేషన్ వంటి కీలక బాధ్యతలను మహిళా సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తూ, గృహ హింస బాధితులకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

​వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత

మహిళా అధికారులు విధుల్లో ధైర్యంగా, నమ్మకంతో ముందుకు సాగాలని, అదే సమయంలో వృత్తిపరమైన మరియు వ్యక్తిగత బాధ్యతల మధ్య సమతుల్యత పాటించాలని సూచించారు. మహిళల సంక్షేమం, భద్రత, వృత్తిపరమైన ఎదుగుదలకు కమిషనరేట్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

​అవగాహన సదస్సులు

కార్యక్రమంలో భాగంగా పలువురు నిపుణులు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక నిర్వహణ, మానసిక వికాసం వంటి అంశాలపై సెమినార్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు, ఉన్నతాధికారులు, వివిధ విభాగాలకు చెందిన మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొన్నారు.WhatsApp Image 2026-03-08 at 20.16.16

About The Author