రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ.

  • ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు.
  • జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని టీయూడబ్ల్యూజే -ఐజేయూ జిల్లా యూనిట్ అభ్యర్థన.
  • రాయితీపై హర్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు.
  • కలెక్టర్,డీఈఓలకు ధన్యవాదాలు : జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా.

రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ.

హైదరాబాద్:

రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు పూర్తి రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే జిల్లా శాఖ తరుపున చేసిన వినతికి స్పందించిన డిఈఓ 50 శాతం రాయితీ ఇవ్వాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఏలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేటు పాఠశాలలో పిల్లల చదువులకు ఫీజులు భారంగా మారాయని జిల్లా కలెక్టర్ తో పాటు డిఈఓ దృష్టికి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా నేతృత్వంలోని బృందం గురువారం నాడు తీసుకెళ్లటంతో ఈ మేరకు జిల్లా విద్యాధికారి శుక్రవారం నాడు ఉత్తర్వులు ఇచ్చారు.ఉత్తర్వు కాపీలను డిఈఓ వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషాకు అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డికి,అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి,డిఈఓ వెంకటేశ్వర్లుకు జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా, జిల్లా జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు.ఈ ఆదేశాలు అన్ని పాఠశాలల్లో వర్తించేలా చూడాలని కోరారు.ఈ మేరకు ఆయా మండలాల ఎంఈఓలకు కుడా సూచిస్తామని, ఉత్తర్వు కాపీలను పంపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మారాటీ రవి, జర్నలిస్ట్ నేతలు కరుణాకర్, భాస్కర్ , భార్గవ్, శ్రీనివాస్,శివ తదితరులు పాల్గొన్నారు.

About The Author