ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెరిసిన తారాజువ్వలు
ఎల్బీనగర్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని శ్రీ యశస్విని 1000 మార్కులకు గాను 975 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది.
అలాగే ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నాజియా ఖాతూన్ 1000 మార్కులకు గాను 970 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. ఈమె తల్లిదండ్రులు సాజా ఖాతూన్, అన్నారుల్. అన్నారుల్ సైకిల్ పంక్చర్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి గృహిణి. అత్యంత పేదరికం నుంచి వచ్చిన నాజియా ఖాతూన్ పాఠశాల స్థాయి నుంచే ప్రతిభ చూపుతూ వస్తోంది.
ఇతర గ్రూపులలో :
• సీఈసీలో ఆర్. నందిని 920/1000 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది.
• హెచ్ఈసీలో మహేష్ 696/1000 మార్కులతో ప్రథమ స్థానం పొందాడు.
• ఏ & టీలో ఎం. శ్రీకాంత్ 962/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడు.
మొత్తం కళాశాలలో 65% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రేణుకుంట్ల అనురాధ, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయానికి ప్రిన్సిపాల్ అనురాధ మార్గదర్శకత్వం, అధ్యాపకుల కృషి ఎంతో దోహదం చేసిందని తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ మరియు అధ్యాపకులు ఘనంగా సన్మానించారు.
