అమీర్‌పేటలో షాపింగ్ కాంప్లెక్స్‌కు మంటలు

సకాలంలో స్పందించిన హైడ్రా, ఫైర్ సిబ్బంది.. తప్పిన పెను ప్రమాదం

అమీర్‌పేటలో షాపింగ్ కాంప్లెక్స్‌కు మంటలు

 హైదరాబాద్:

నగరంలోని అమీర్‌పేటలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది, హైడ్రా విపత్తు ప్రతిస్పందన బృందం (డీఆర్ఎఫ్) కలిసి చాకచక్యంగా అదుపులోకి తెచ్చాయి. సకాలంలో స్పందించి చర్యలు చేపట్టడంతో మంటలు పక్కనే ఉన్న దుకాణాలకు, ఇతర భవనాలకు వ్యాపించకుండా నిలిచిపోయాయి. దీనితో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

*మెట్రో పిల్లర్ సమీపంలో ప్రమాదం
అమీర్‌పేట నుంచి ఎస్.ఆర్.నగర్ వెళ్లే మార్గంలో, మెట్రో పిల్లర్ నంబరు 1043 సమీపంలో ఉన్న రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.WhatsApp Image 2026-06-04 at 19.37.08 (1)

*రంగంలోకి దిగిన హైడ్రా డీఆర్ఎఫ్
ప్రమాదంపై హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు అందగానే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్షేత్రస్థాయిలో ఉన్న డీఆర్ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి పరుగులు తీయించారు. అగ్నిమాపక సిబ్బందితో చేతులు కలిపిన 20 మంది డీఆర్ఎఫ్ సభ్యులు మంటలను ఆర్పే పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. భవనం వెనుక వైపు ఉన్న మెస్‌తో పాటు, పక్కనే ఉన్న ఇతర వ్యాపార సముదాయాలకు మంటలు అంటుకోకుండా ఫైర్ ఇంజిన్ల సహాయంతో అదుపు చేశారు.

*అధికారుల పరిశీలన
ప్రమాద స్థలాన్ని హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆర్‌ఎఫ్‌ఓ జయప్రకాష్, ఎస్‌ఎఫ్‌ఓ చంద్రశేఖర్‌ల నేతృత్వంలోని డీఆర్ఎఫ్ బృందం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.WhatsApp Image 2026-06-04 at 19.37.07

About The Author