తప్పిపోయిన మతిస్థిమితం లేని వ్యక్తి

తప్పిపోయిన మతిస్థిమితం లేని వ్యక్తి

ఎల్బీనగర్

మతిస్థిమితం కలిగిన 60 ఏండ్ల వయసు కలిగిన వ్యక్తి గత నెల 29వ తేది నుండి పనికి వెళుతున్నానంటూ చెప్పి వెళ్లి 10 రోజుల నుండి కనపడకుండా పోయాడని, బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లేదని, సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కుమారుడు ఫిర్యాదు చేశారు.సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగోజిగూడలో నివసించే బైకడి ఆనంద్ తండ్రి మతిస్థిమితం లేని నర్సింహా (60)ఏండ్ల వయసు. సరూర్నగర్ లేబర్ అడ్డాకు పని కోసం వెళ్లి 12  రోజులు అయినా తిరిగిరాలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాలు... తప్పిపోయిన వ్యక్తి బైకడి నర్సింహా చమన ఛాయ కలిగి 5 ఫీట్ల ఎత్తు,ఎరుపు గీతల చొక్కా,నలుపు ప్యాంట్ ధరించాడని, తెలుగు, హిందీ భాషలు మాట్లాడగలడని తెలిపారు. మతిస్థిమితం సరిగ్గా లేక గతంలో కూడా మూడు సార్లు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయి తిరిగి వచ్చాడని ఎవరికైనా ఇతని ఆచూకీ తెలిసినచో సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో తెలపగలరని తెలియజేశారు.

About The Author