రాగన్నగూడలో వైభవంగా సహస్రచండీ యాగం.

​అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్

రాగన్నగూడలో వైభవంగా సహస్రచండీ యాగం.

హయత్ నగర్:

లోక కల్యాణం కోసమే కాకుండా, దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాగన్నగూడలో నిర్వహిస్తున్న "మహారుద్ర సహిత సహస్రచండీ" మహాయాగం కన్నుల పండుగగా సాగుతోంది. శ్రీ రేణుక రాజరాజేశ్వరి పీఠం ఆధ్వర్యంలో శ్రీ మెల్లూరి నవీన్ శర్మ గారి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ జగన్మాత సేవలో శుక్రవారం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈటలతో పాటు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బి.ఎన్. రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
​ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు వెంకట్ రామ్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About The Author

Related Posts