అమీర్‌పేట్‌ కెఎస్సార్ ఫ్యాషన్స్ లో భారీ అగ్ని ప్రమాదం:టౌన్ ప్లానింగ్ కక్కుర్తి.. ‘స్టే’ల చాటున అక్రమ దందా!

  • మైత్రివనం మెయిన్ రోడ్డుపై ‘కెఎస్సార్ ఫ్యాషన్స్’ బుగ్గిపాలు.. అమీర్‌పేట్ అతలాకుతలం
  • *రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ మాఫియా.. అదనపు ఫ్లోర్లలో ‘మృత్యు’ గోడౌన్లు
  • *‘హైడ్రా’ బుల్డోజర్లకు ‘లీగల్’ బ్రేకులు.. కోర్టు లొసుగులతో అక్రమార్కుల ఆటలు!

అమీర్‌పేట్‌ కెఎస్సార్ ఫ్యాషన్స్ లో భారీ అగ్ని ప్రమాదం:టౌన్ ప్లానింగ్ కక్కుర్తి.. ‘స్టే’ల చాటున అక్రమ దందా!

అమీర్‌పేట్ ‘కెఎస్సార్ ఫ్యాషన్స్’ అగ్నిప్రమాదం కేవలం ఒక యాదృచ్ఛిక విపత్తు కాదు; ఇప్పుడు టౌన్ ప్లానింగ్ పబ్లిక్ పోర్టల్ బిల్డ్ నౌ పారదర్శకత లోపం: అది టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి కక్కుర్తికి, అగ్నిమాపక శాఖ ఉదాసీనతకు నిదర్శనం. రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ మాఫియా నడుపుతూ, అక్రమ అంతస్తుల్లో ‘మృత్యు గోడౌన్లు’ నిర్మించడం వ్యవస్థాగత నేరానికి పరాకాష్ట. ‘హైడ్రా’ కఠిన చర్యలు చేపడుతున్నా, కోర్టు లొసుగులు, మున్సిపల్ లాయర్ల లాలూచీ, ‘ఇంటర్ స్టే’ ఆర్డర్ల రక్షణ కవచంతో అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో జూదమాడుతున్నారు. కేవలం లాభాపేక్ష-అవినీతి కలయికతో నడుస్తున్న ఈ క్లిష్టమైన ‘లీగల్’ సవాళ్లను అధిగమించి, వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే మరిన్ని అమాయక ప్రాణాలు బుగ్గిపాలు కాక తప్పదు.

హైదరాబాద్:

నగరం నడిబొడ్డున మరో ‘షాపింగ్ మృత్యుకూపం’ బట్టబయలైంది. టౌన్ ప్లానింగ్ అధికారుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖ ఉదాసీనత, కోర్టు ‘స్టే’ల లొసుగులు కలిసి అమాయక ప్రజల ప్రాణాలతో ఎలా జూదం ఆడుతున్నాయో అమీర్‌పేట్ అగ్ని ప్రమాదం మరోసారి నిరూపించింది. అత్యంత రద్దీ ప్రాంతమైన శ్రీనివాసనగర్ వెస్ట్, మైత్రివనం మెయిన్ రోడ్డు పక్కనే.. మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న "కెఎస్సార్ ఫ్యాషన్స్" (KSR Fashions) మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వస్త్ర సామగ్రితో నిండిన ఆ బహుళ అంతస్తుల భవనంలో మంటలు క్షణాల్లో రెండో అంతస్తుకు, ఆపై పక్కనే ఉన్న వాణిజ్య దుకాణాలకు వ్యాపించాయి. దట్టమైన నల్లటి విషపొగతో అమీర్‌పేట్ అతలాకుతలమైంది, గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది.
అయితే, ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కాదు.. ముమ్మాటికీ మున్సిపల్, అగ్నిమాపక శాఖల అవినీతి అండతో జరిగిన "వ్యవస్థాగత నేరం" దీనిపై ‘భారత శక్తి’ ఇన్వెస్టిగేటివ్ డెస్క్ జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.WhatsApp Image 2026-06-04 at 19.27.01

*1.పర్మిషన్ ఒక దానికి.. దందా ఇంకోదానికి!
అమీర్‌పేట్, మైత్రివనం పరిసరాల్లోని వందలాది భవనాలలాగే ఈ ప్రమాదం జరిగిన భవనంలోనూ ప్రాథమిక నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి.

 *రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ దందా: 
నివాస ప్రాంతాల పరిధిలో కేవలం ఇళ్లు నిర్మించుకుంటామని జీహెచ్‌ఎంసీ (GHMC) టౌన్ ప్లానింగ్ విభాగం నుండి అనుమతులు పొంది, వాటిని రాత్రికి రాత్రే భారీ షాపింగ్ మాల్స్‌గా, బట్టల గోడౌన్లుగా మార్చేస్తున్నారు. నివాస భవనాలకు వాడే కరెంట్ లైన్లపై.. ఇలాంటి భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌ల ఏసీలు, హై-వోల్టేజ్ లైటింగ్ పడటంతో తీవ్రమైన ఒత్తిడి (Overload) ఏర్పడి తీగలు వేడెక్కి షార్ట్ సర్క్యూట్లకు దారితీస్తోంది.

 *'స్టేషన్లు' మారినా.. స్టోర్ రూమ్‌ల అక్రమాలు ఆగవు:
 నాలుగు అంతస్తుల (G+4) వరకు కమర్షియల్ అనుమతులు తీసుకుని, టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచాలు ఎరవేసి అదనంగా ఎక్స్ట్రా ఫ్లోర్స్ నిర్మిస్తున్నారు. వీటిని రికార్డుల్లో చూపించకుండా, లోపాయికారీగా "స్టోర్ రూమ్‌లు" గా వాడుతున్నారు. "కెఎస్సార్ ఫ్యాషన్స్" ప్రమాదంలో మంటలు ఇంతలా విజృంభించడానికి కారణం.. ఇలాంటి అక్రమ స్టోర్ రూముల్లో టన్నుల కొద్దీ నిల్వ ఉంచిన సింథటిక్ వస్త్ర సామగ్రియే!

 2. కాసులు ఇస్తే చాలు.. ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ ఖాయం!
ఒక రద్దీ వాణిజ్య సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో అమీర్‌పేట్ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. మరి ఇలాంటి భవనాలకు ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఎలా వస్తోంది?

 *కళ్లు మూసుకుంటున్న అగ్నిమాపక శాఖ: జాతీయ భవన నిర్మాణ కోడ్ (NBC) ప్రకారం ప్రతి కమర్షియల్ భవనానికి ఫైర్ ఎస్కేప్ (Emergency Exits), స్ప్రింక్లర్లు, ఫైర్ హైడ్రెంట్లు ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన అగ్నిమాపక శాఖ అధికారులు ఏటా మామూళ్లు అందుకొని, ఏసీ గదుల్లో కూర్చుని క్లియరెన్స్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 *మృత్యుకూపాలుగా మారిన సెల్లార్లు:
పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను సైతం కమర్షియల్ గోడౌన్లుగా మార్చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? సెల్లార్లలో మంటలు అంటుకుంటే ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లే మార్గమే ఉండదు.

*3.‘హైడ్రా’ యాక్షన్‌కు ‘లీగల్’ బ్రేకులు!
నగరంలో అక్రమ నిర్మాణాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) ఇలాంటి డేంజర్ జోన్లలో ఉన్న అక్రమ కమర్షియల్ కాంప్లెక్సులపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నా.. క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఇబ్బందులు, వ్యూహాత్మక అడ్డంకులు ఎదురవుతున్నాయి.

 *మున్సిపల్ లాయర్ల ‘మేనేజ్‌మెంట్’ తంతు:
 అక్రమ కమర్షియల్ భవనాలపై అధికారులు లేదా హైడ్రా నోటీసులు ఇవ్వగానే, సదరు భవన యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ తరఫున గట్టిగా వాదించాల్సిన కౌన్సిల్ లాయర్లను అక్రమార్కులు ముందే ‘మేనేజ్’ చేస్తున్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి. కోర్టులో మున్సిపల్ యంత్రాంగం తరఫున సరైన అఫిడవిట్లు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు.WhatsApp Image 2026-06-04 at 19.27.01

 *ఇంటర్ పిటిషన్ల దందా.. ‘స్టే’ల రక్షణ కవచం:
ఈ లొసుగులను వాడుకుని అక్రమార్కులు కోర్టుల నుండి "ఇంటర్ పిటిషన్ ఆర్డర్లను" (Interim Stay Orders) సాధిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్లు భవనం ముందుకు వెళ్లగానే.. చేతిలో ‘స్టే’ కాపీలు చూపిస్తూ మున్సిపల్ చట్టాలను హేళన చేస్తున్నారు. ఈ ‘స్టే’ ఆర్డర్ల అండ చూసుకుని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారు. చివరకు ప్రమాదం జరిగి ప్రాణాలు బూడిదయ్యే వరకు ఆ భవనాల జోలికి వెళ్లే సాహసం అధికారులు చేయలేకపోతున్నారు.

4.అగ్నికి ఆజ్యం పోస్తున్న 'టాక్సిక్ స్మోక్'
అగ్ని ప్రమాదాలలో మంటల కంటే "టాక్సిక్ స్మోక్" (విషపూరిత పొగ) అత్యంత ప్రమాదకరమైనది. భవనాలలో అదనపు అంతస్తుల నిర్మాణం వల్ల వెంటిలేషన్ లోపించి, మంటలు చెలరేగినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి ప్రాణాంతక వాయువులు లోపలే పేరుకుపోతాయి. దీనికి తోడు సింథటిక్ వస్త్రాలు కాలడం వల్ల దట్టమైన నల్లటి విషపొగ వెలువడుతుంది. అత్యవసర మార్గాలు మూసివేయడం వల్ల బాధితులు బయటపడలేక, ఊపిరాడక నిమిషాల్లోనే స్పృహ కోల్పోతారు.


 ‘హైడ్రా’ ఆక్టివ్ గా పని చేస్తున్నా ..ఎదురవుతున్న సవాళ్లు ..?

ఇలాంటి అక్రమ కమర్షియల్ భవనాలపై హైడ్రా ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నప్పటికీ.. కేవలం ‘భవనాల కూల్చివేత’ మాత్రమే పరిష్కారం కాదనే వాదనలు వస్తున్నాయి.

 1.ఆర్థిక, ఉపాధి సంక్షోభం: ఒక అక్రమ భవనాన్ని సీజ్ చేసినా, కూల్చివేసినా దానిపై ఆధారపడిన వందలాది మంది కార్మికులు, చిన్న వ్యాపారులు రోడ్డున పడే ప్రమాదం ఉంది.

 2.యాజమాన్యాల మొండితనం: తాము కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేశామని, తప్పు అధికారులదైతే తమను ఎందుకు బలిచేస్తారని యజమానులు హైడ్రా అధికారులతో ఘర్షణకు దిగుతున్నారు.

 3.లీగల్ చిక్కుముడులు: ప్రభుత్వ రికార్డుల్లో అనుమతులు ఉన్నట్లు చూపించి, క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడటం వల్ల.. హైడ్రా తీసుకునే తక్షణ చర్యలకు కోర్టులు అడ్డుకట్ట వేస్తున్నాయి.

 శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా మారిన వ్యవస్థ!
అమీర్‌పేట్ మెట్రో పిల్లర్ A1043 సాక్షిగా రేగిన అగ్ని కీలలు నగరంలోని ప్రతి అక్రమ కమర్షియల్ భవనానికీ హెచ్చరిక. ఈ ప్రమాదాలు కేవలం అదృష్టవశాత్తూ తప్పించుకునేవి కావు, అవి ఖచ్చితంగా లాభాపేక్ష-అవినీతి ల కలయికతో జరుగుతున్న సాంఘిక నేరాలు. కోర్టు స్టే ఆర్డర్ల వెనుక ఉన్న లొసుగులను ఛేదించాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ లీగల్ వింగ్‌పై, ప్రభుత్వంపై ఉంది. హైడ్రా లాంటి ప్రత్యేక విభాగానికి పూర్తిస్థాయి న్యాయపరమైన అధికారాలు (Judicial Powers) ఇచ్చి, టౌన్ ప్లానింగ్, ఫైర్ అధికారుల కక్కుర్తికి అడ్డుకట్ట వేయాలి. అలా చేయకుండా నియంతృత్వ ధోరణితో అక్రమ కమర్షియల్ భవనాలను సీజ్ చేయకపోతే.. అమాయక ప్రజల ప్రాణాలు అక్రమార్కుల లాభాల జూదంలో బుగ్గిపాలు కావడం ఖాయం.

About The Author