పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్మల్ పోలీసుల సరికొత్త ప్రయత్నం
ప్రతిభ కలిగి ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్న ఇరవై మంది హోంగార్డుల పిల్లలకు నవీన్ గోల్డ్, బ్రదర్స్ వారి సౌజన్యంతో ఆర్థిక సహాయం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... మా “పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా పేద కుటుంబాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. వారిలో చాలా మంది పిల్లలు ప్రతిభావంతులు, కష్టపడి చదువుకుంటున్నారు. అలాంటి పిల్లల ప్రతిభను గుర్తించి, వారు ఉన్నత విద్యలో మరింత రాణించేందుకు ఈ ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది.వారి తల్లిదండ్రులు ప్రజల భద్రత కోసం రాత్రింబగళ్లు కష్టపడుతుంటే, ఆ కుటుంబాల పిల్లలకు ఈ ఆర్థిక సహాయం ద్వారా మనం చిన్న సాయం చేసినా, అది వారి భవిష్యత్తు నిర్మాణానికి దోహదం చేస్తుందని తెలిపారు.ఈ గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చి, పేద పోలీస్ కుటుంబాల పిల్లలకు ఆర్థిక సహాయం చేసిన నవీన్ జ్యూవెలర్స్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలియ జేశారు.
నవీన్ జ్యువెలర్స్ యజమాని మాట్లాడుతూ... "నేను ఒక పోలీస్ కుటుంబానికి చెందిన వ్యక్తిని. చిన్నప్పటి నుండి పోలీస్ వాతావరణంలో పెరిగిన కారణంగా, మా పోలీస్ సిబ్బంది — కానిస్టేబుళ్లు, హోం గార్డులు — ఎదుర్కొనే కష్టాలు, బాధలు నాకు బాగా తెలుసు. అందుకే మా పోలీసులు కుటుంబాల పిల్లలను ప్రోత్సహించాలనే ఆలోచనతో, జిల్లా ఎస్పీ మేడం గారితో చర్చించి ఈ ఆలోచనను అమలు చేశాను అని తెలియ జేశారు. ఈ సందర్భంలో పోలీస్ పిల్లల్లో ఒకరు మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మాకు ఇలాంటి సహాయం చేయలేదు, ఎస్పీ మేడం గారికి ఇంత గొప్ప ఆలోచన రావడం చాలా సంతోష కరమైన విషయం అని, “ఈ ప్రోత్సాహం మాకు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. మా తల్లిదండ్రుల త్యాగం వృథా కాకుండా చదువులో మెరుగుపడేందుకు కృషి చేస్తాం” అన్నారు. మాకు ఈ ఆర్థిక సహాయం చేసిన జిల్లా ఎస్పీ మేడం గారికి, నవీన్ జ్యూవెలర్స్ యాజమాన్యానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అని తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల తో పాటు,నవీన్ జ్యూవెలర్స్ యాజమాన్యం ప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎస్పీ గారికి మరియు నవీన్ జ్యూవెలర్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రోత్సాహం పొందుతున్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు
1) పి శ్రీనివాస్ s/o నర్సింలు, (ప్రస్తుతం B.Tech Final Year చదువుతున్నాడు)
2) శృతిలయ s/o రాజేశ్వర్, (ప్రస్తుతం B.Tech Final Year చదువుతున్నది)
3) శివకుమార్ s/o ఎల్ భూమన్న, (ప్రస్తుతం Degree చదువుతున్నాడు)
4) మాసం సాత్విక్ s/o మాసం కిరణ్, (ప్రస్తుతం 9th Class చదువుతున్నాడు
5) ఆర్ లావణ్య D/o గణపతి, (ప్రస్తుతం IIT 1st year చదువుతున్నది)
6) జాదవ్ దివ్య D/o శ్యాం నాయక్ (ప్రస్తుతం MBBS చదువుతున్నది)
7) ఎన్ శిల్ప m /o భాగ్యలక్ష్మి, (ప్రస్తుతం B Pharmacy చదువుతున్నది)
8) జె స్మిత D/o దిలీప్ (ప్రస్తుతం Intermediate చదువుతున్నది)
9) కే చరణ్ s/o సాగర్ (ప్రస్తుతం Intermediate చదువుతున్నాడు)
10) ఆర్ వర్ష s/o శ్రీనివాస్ (ప్రస్తుతం Intermediate చదువుతున్నది)
11) ఏ సాయి సృజన్ s/o రవి (ప్రస్తుతం Intermediate చదువుతున్నాడు)
12) దినేష్ s/o కిష్టయ్య (ప్రస్తుతం B. Tech 2nd Year చదువుతున్నాడు)
13) ఎం గంగామణి D/o సురేందర్ (ప్రస్తుతం Intermediate 2nd Year చదువుతున్నది)
14) డి రాకేష్ S/o లక్ష్మణ్ (ప్రస్తుతం Intermediate 1st చదువుతున్నాడు)
15) ఎండి అయాన్ ఖాన్ S/o అలీం ఖాన్ (ప్రస్తుతం B. Tech 1st చదువుతున్నాడు)
16) ప్రణీత్ కుమార్ S/o వెంకటరావు (Intermediate)
17) జి అశ్విని D/o రమేష్ (ప్రస్తుతం Intermediate 2nd Year చదువుతున్నది)
18) కే ఆనంద్ S/o జగదీష్ (ప్రస్తుతం B.Tech Final Year చదువుతున్నది)
19) ఐశ్వర్య M/o రమాదేవి (ప్రస్తుతం LLB)
20) అనన్య D/o సంతోష్ (ప్రస్తుతం 8th Class)
