యశోద హాస్పిటల్ లో ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స

వివరాలు వెల్లడించిన డాక్టర్ సాగరి గుల్లపల్లి 

WhatsApp Image 2025-11-20 at 7.38.03 PM

సంగారెడ్డి : 
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డాక్టర్ సాగరి గొల్లపల్లి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ లో జరిగిన అరుదైన ఆపరేషన్ వివరాలను బాలుడు ధర్మారెడ్డి తండ్రి భరత్ రెడ్డి తో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాగరి మాట్లాడుతూ చిన్నప్పటినుండి హెచ్డిఎఫ్సి తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడు కపిల్ రెడ్డి ధర్మారెడ్డికి విజయవంతంగా చికిత్స అందించామని అయితే బాలుడు గత కొంతకాలంగా మూడు యాంటీ ఎపిలిప్టిక్ మందులు వాడుతున్నప్పటికీ ఆ బాలుడు తల మరియు  బాలుడు తల మరియు కళ్ళలోటానిక్ డివిషన్ లక్షణాలను అనుభవిస్తున్నాడని దానికి తోడు కొంత సమయం స్పృహ కోల్పోతున్నారని తెలిపారు. న్యూరోలాజికల్ పరీక్షల తర్వాత వైద్య బృందం శస్త్ర చికిత్సను  అందించాలని కోరగా ఫిబ్రవరి 21 పేషెంట్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం బాలుడు పూర్తిగా కోలుకోవడం సజావుగా జరిగిందని ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ చేశామని తెలిపారు. యశోద హాస్పిటల్ లో పీడియాట్రిక్ మరియు పెద్దలకు మూర్చ సమస్యకు చికిత్స చికిత్స అందిస్తున్నామని, అదునాతిక న్యూరో ఇమేజింగ్ న్యూరో సర్జికల్ విధానాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. 

About The Author