కనికరమే లేని కఠినమైన ప్రైవేట్ హై స్కూల్

  • రికవరీ గ్యాంగ్ వలే తయారైన ప్రైవేట్ పాఠశాల 
  • ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు భయమనదే లేదా...?
  • ఫీజు వసూళ్ల పేరిట తల్లిదండ్రులను బెదిరిస్తున్న టీచర్లు
  • తోటి పిల్లల ముందు ఫీజు కట్టని వారిని నిలబెట్టి వేధింపులు
  • ఎంఈఓ, డిఈఓలకు చెప్తారా ఎవరికైనా చెప్పుకోండి...
  • మమ్ములను ఎవరూ ఏమి చేయలేరు...యాజమాన్యం ధీమా 
  • తల్లిదండ్రులు ఎంత బతిమిలాడినా వినిపించుకోని అడ్మిన్
  • ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు వెళ్లే దారి లేని పరిసరాలు 

కనికరమే లేని కఠినమైన ప్రైవేట్ హై స్కూల్

ఎల్బీనగర్:

పాఠశాల నడిచేది స్లమ్, మిడిల్ స్లమ్ ఏరియాలో, పిల్లలు కూడా మధ్య, పేద తరగతి కుటుంబం నుండి చదువుకోవడానికి వచ్చేవారే ఎక్కువ. పాఠశాల ఉండేది అగ్గిపెట్టే లాంటి బిల్డింగ్ లో.. అందులోనే ఒకటవ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువులు, ఆట స్థలం ఉండదు,ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు వెళ్లలేని పరిసరాలు. కానీ ఫీజులు మాత్రం సరైన సమయానికి కట్టాలని తల్లిదండ్రులకు బెదిరింపులు, క్లాస్ రూములో తోటి పిల్లల ముందు నిలబెట్టి వేధింపులు, ఎంఈఓ, డిఈఓలకు ఫిర్యాదు చేసినా మేము డోంట్ కేర్ అంటున్న పాఠశాల యాజమాన్యం. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులు పడే ఆవేదన అంతా ఇంత కాదు.ఎంత బతిమిలాడినా వినిపించుకోని అడ్మిన్ కవిత. డబ్బుల మీద యావ తప్ప, ఏదీ పట్టించుకోని పాఠశాల యజమాని జనార్దన్. సరూర్ నగర్ డివిజన్ వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 5 లోని శ్రీ నియో టెక్ హైస్కూల్ (ఎస్ఎన్టీ) యాజమాన్యం పిల్లలను వారి తల్లిదండ్రులను ఫీజుల కోసం రాచి రంపాన పెడుతున్నారు.బంగారం లాంటి వస్తువులు కుదువ బెట్టి కట్టినా, మిగిలి ఉన్న కట్టాల్సిన ఫీజు 2 వేలు 3 వేలు పెండింగ్ ఉన్నా, హల్ టికెట్ ఇవ్వకుండా,పరీక్షలు రాయనీయకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు.ఎలాగో పిల్లలు వచ్చే ఏడాది కూడా ఇక్కడే చదువుతారు కదా, కొద్దిగ టైం ఇస్తే కడతామని చెప్పినా కనికరం లేకుండా, ఖరాకండిగా బకాయి ఫీజు కట్టాల్సిందేనని బెదిరింపులకు దిగుతున్న పాఠశాల అడ్మిన్. ఎంఈఓకు ఫిర్యాదు చేస్తే, సర్ మేము పిల్లలను అలా ఎప్పుడు ఇబ్బంది పెట్టమని సమాధానం చెప్తున్న అడ్మిన్ కవిత. పరీక్షల సమయంలో పాఠశాల యాజమాన్యం అధికారులు అంటే భయం లేకుండా, లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్ నిలబెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

About The Author