బిల్డింగ్ పైనుండి దూకిన మహిళ... చికిత్స పొందుతూ మృతి

బిల్డింగ్ పైనుండి దూకిన మహిళ... చికిత్స పొందుతూ మృతి

ఎల్బీనగర్:

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న మన్య శివకుమార్ భార్య మన్య మాధవి (35)కుటుంబ కలహాల నైపథ్యంలో వారు నివాసం ఉంటున్న బిల్డింగ్ పైనుండి కిందకు దూకగా బలమైన గాయాలవడంతో ఆమె భర్త శివకుమార్ దగ్గరలో ఉన్న ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా, మన్య మాధవి చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరణించింది. ఆమె మృతిపై అనుమానంతో భర్త శివకుమార్ పై మృతురాలి తండ్రి బాశెట్టి శ్రీను చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.

About The Author