సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు
- లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు సైబర్ క్రైం ఎస్ఐలు
- ప్రజలను రక్షించవలసిన రక్షకులే భక్షకులవుతున్నారు
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏసీబి అధికారులు తనిఖీలు చేసారు. ఈ తనిఖీలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్సైలు పట్టుబడ్డారు. కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్ముడ్ రిజర్వ్ సబ్ ఇన్స్ పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబునాయక్ వీరిరువు ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్నారు.ప్రజలను రక్షించే రక్షక భటులే భక్షకులవుతున్నారు. ఓ సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం బాధితులను అరెస్ట్ చేయకుండా ఉండడంతో పాటు, బ్యాంక్ అకౌంట్ ఖాతాలను నిలిపి వేయకుండా ఉండడం కోసం, భాధితులను ముందుగా మూడు లక్షలు రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఒక లక్ష రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు.సైబర్ క్రైం ఎస్ఐల దాష్థికం తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పి గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం సభ్యులు సోమవారం దాడులు చేయగా బాధితుల నుండి రూ. 1 లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరు ఎస్సైలు పట్టుబడ్డారు. లంచం తీసుకున్న డబ్బులను స్వాధీనం చేసుకున్న అనంతరం సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఏసీబి అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు ఎస్సైలను నాంపల్లిలోని ఏసీబి కోర్టు అడిషనల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ తరలించారు. దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ఏసీబి అధికారులు తెలిపారు.
