రైతు వరి పంటను నష్టపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట :
సూర్యాపేట రైతు వరి పంటను నష్టపరిచిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కుప్పిరెడ్డిగూడెం లోని మందాడి పద్మా రెడ్డి కి చెందిన రెండు ఎకరాల భూమి లో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు కలపడంతో పూర్తిగా ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరంగా లేక పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదన్నారు.పోలీసులు వెంటనే కలగజేసుకొని ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రామ్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు పందిరి సత్యనారాయణ రెడ్డి,చిట్లంకి యాదగిరి,నాయకులు దుబ్బాక వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకటి వెంకట్ రెడ్డి, బిక్షం రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
