అడ్డా కూలి కి వెళ్లిన మహిళా హత్య

అడ్డా కూలి కి  వెళ్లిన మహిళా హత్య

జవహర్ నగర్:
  

జవహర్ నగర్  పోలీస్ స్టేషన్ పరదిలో దాసరి యెల్లయ్య, తండ్రి పేరు లేట్ శివాజీ, వయసు 28 సంవత్సరాలు, వృత్తి కూలి, ప్రస్తుతం దేవేందర్ నగర్, జవహర్‌నగర్, కాప్రా మండలం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నివాసం ఉంటున్నాడు. ఇతని స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా, అమంగల్ మండలం, మంగళపల్లి గేట్ వద్ద ఉన్న చెన్నకేశవ కాలనీ. ఇతనికి నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారిలో మూడో చెల్లెలు ద్యావేరంగుల విజయ, భర్త లేట్ హనుమంత్, వయసు 35 సంవత్సరాలు, వృత్తి కూలి. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు — శివ (14 సంవత్సరాలు), చరణ్ (12 సంవత్సరాలు). ఆమె ప్రతిరోజూ దమ్మాయిగూడ కూలీ అడ్డాకు పని కోసం వెళ్తుంది. తేదీ 25-03-2026 తేదీన మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో విజయ ఇంటి నుండి బయటకు వెళ్లి, తన పిల్లలకు “మేసన్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుని రాత్రి 8 గంటల లోపల వస్తాను” అని చెప్పింది. కానీ ఆ రాత్రి ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయం తెలిసిన ఆమె అన్న  సమీప ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ కనబడలేదు. గతంలో కూడా ఆలస్యంగా వచ్చిన సందర్భాలు ఉండటంతో పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వలేదు. తేదీ 26-03-2026 తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఫిర్యాదుదారుడి బంధువు లక్ష్మికి ఒక ఫోన్ కాల్ వచ్చి, దమ్మాయిగూడలో మణిషా వైన్స్ వెనకాల పొదలలో  ఓ మహిళ మృతదేహం పడివుందని, ఆమె ఫోటో కూడా పంపించారు. ఆ ఫోటో చూసిన ఫిర్యాదుదారు మరియు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసి, అది విజయ మృతదేహమని గుర్తించారు. ఫిర్యాదుదారు ప్రకారం, అతని మేనత్త కూతురు యశోద (అంబేద్కర్ నగర్, జవహర్‌నగర్) మరియు బాలస్వామి (శాంతి నగర్, జవహర్‌నగర్) తరచూ విజయతో గొడవపడుతూ, కొట్టడంతో పాటు ఆమె దగ్గర డబ్బులు కూడా తీసుకునేవారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా బాలస్వామి ఆమెను వేధిస్తున్నాడని తెలిపారు. విజయ ముఖంపై గాయాలు ఉండటం మరియు రక్తస్రావం కనిపించడం వల్ల, బాలస్వామి ఆమెను హత్య చేసి ఉంటాడని  అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కావున ఇట్టి విషయంపై తగిన చర్య తీసుకోవాలని ఫిర్యాదారుడు పేర్కొన్నాడు.

About The Author