పర్యావరణ పరిరక్షణ పోటీలలో అల్పోర్స్ ప్రతిభ
కరీంనగర్ :

విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పట్ల పరిపూర్ణంగా అవగాహన కల్పించాలని, పర్యావరణం సంరక్షించడం వలన కలిగేటువంటి లాభాలను విద్యార్థులకు పాఠ్యాంశ ప్రణాళికలో భాగంగా చాలా స్పష్టంగా సంగ్రహంగా తెలియపరచవలసిన అవకాశం చాలా ఉందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలియజేసారం నగరంలోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ నెక్స్ట్ లో వ్యాసరచన పోటీల విజేతల బహుమతుల ప్రధానం జరిగింది.గురువారం జరిగిన సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుత నేటి సమాజంలో కాలుష్యం ప్రధాన సమస్యగా మారిందని కాలుష్యం వలన భావితరాలకు ఉపయోగపడే అటువంటి వనరులు తరిగిపోవడం మరియు దొరకకపోవడం చాలా భయాందోళనకు గురి చేసే విషయమని తెలుపుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని సంరక్షించాలని, చర్యలను పాటించి పర్యావరణ కాలుష్యాన్నీ నివారించాలని తెలిపారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు వివిధ రకాల ప్రతిభ పాటవ పోటీలను నిర్వహిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రధానం చేయడం గొప్ప సాంప్రదాయంగా వస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా బీఎస్ఎ- హర్కులస్ కంపెనీ సంయుక్తంగా నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందినటువంటి జి.ఋషిగ్న, 8వ తరగతి, బాలికల విభాగంలో మరియు బాలుర విభాగంలో జి. రుషికేష్ 8వ తరగతి అత్యుత్తమ ప్రతిభను కనబరచడమే కాకుండా జిల్లాస్థాయిలో ఉత్తమ ర్యాంకులను కైవసం చేసుకొని సైకిళ్లను గెలుచుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిఎస్ఏ- హర్కులస్ కంపెనీ ప్రతినిధులు శంకర్ గారు, జాన్, పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..
