అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం.. సమానత్వమే రాజ్యాంగ మార్గం!
- మహేశ్వరం నియోజకవర్గంలో ఘనంగా 135వ జయంతి వేడుకలు
- పాల్గొన్న సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత నర్సింహారెడ్డి.
మహేశ్వరం:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు నేటి సమాజానికి దిశానిర్దేశకమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మహేశ్వరం మండల పరిధిలోని చిన్నతూప్ర గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, సహపంక్తి భోజన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలి
బాలాపూర్, బడంగ్‌పేట్ డివిజన్లలో జరిగిన వేడుకల్లో పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. "రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత. బలహీన వర్గాల అభివృద్ధి ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలి" అని ఆమె పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ దేశానికి రెండు కళ్ల వంటి వారని, యువత విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
చిన్నతూప్రలో జరిగిన కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, నాయకులు ఏనుగు జంగారెడ్డి, కృష్ణ నాయక్ పాల్గొన్నారు.
బాలాపూర్, బడంగ్‌పేట్ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డితో పాటు నాయకులు బాలింగని జంగయ్య, గట్టు బాలకృష్ణ, బొల్లపల్లి కుమార్, సూర్ణగంటి విజయ్, గొరిగే శ్రీశైలం, నిరుడు శ్రీరాములు, కొప్పుల రాజు, పగడాల ఉమేష్, గిరికటి కృష్ణంరాజు గౌడ్, టేకుల సుధాకర్ రెడ్డి, సంరెడ్డి మహిపాల్ రెడ్డి, పెద్దబావి బాబు, ఇక్కే శ్రీను, నయన చారి, మనోహర్, గిరి ముదిరాజ్, అనురాధ, అమృత నాయుడు, అరుణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
