వృద్దాశ్రమం నుండి వృద్ధుడు అదృశ్యం

వృద్దాశ్రమం నుండి వృద్ధుడు అదృశ్యం

ఎల్బీనగర్:

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఆల్మాస్‌గూడలోని వినాయక హిల్స్, రోడ్ నెం.5, ఫేజ్-2 ప్రాంతానికి చెందిన రంగనాథ్ (36) ఫిర్యాదు మేరకు ఆయన తండ్రి విజయానంద్ (72), రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, నాగోల్‌లోని కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీలో ఉన్న శ్రీనివాస వృద్ధాశ్రమంలో గత ఒకటిన్నర నెలలుగా ఉంటున్నారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున 1.16 గంటల సమయంలో వృద్ధాశ్రమం నుంచి బయటకు వెళ్లిన విజయానంద్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అదృశ్యమైన విజయానంద్ ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు, బరువు 60 కిలోలు, గుండ్రటి ముఖం కలిగి ఉంటారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో తెలుపు రంగు చొక్కా, నీలం రంగు చెక్స్ నిక్కర్ ధరించి ఉన్నట్లు తెలిపారు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా నాగోల్ పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712662751కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ కోరారు.

About The Author