అన్నదాత ఆర్థిక విప్లవానికి అంకురార్పణ!

  • రూ.3,367 కోట్లతో కోహెడలో ప్రపంచ స్థాయి పండ్ల మార్కెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన.
  • *దేశానికే ఆదర్శంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుకానున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ - మంత్రి తుమ్మల
  • *తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగంలోనే ఇది ఒక మైలురాయి - మంత్రి తుమ్మల
  • *భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి మార్కెట్ నిర్మాణం - మంత్రి తుమ్మల
  • *రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు సమగ్ర సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి - మంత్రి తుమ్మల

అన్నదాత ఆర్థిక విప్లవానికి అంకురార్పణ!

హైదరాబాద్:

*రేపు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. 
ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో సరికొత్త చరిత్రకు నాంది.
తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేసే ఒక చారిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన మౌలిక వసతులతో రూపుదిద్దుకోనున్న "కోహెడ అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్" నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాట్లను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్తు అవసరాలను, ప్రపంచ స్థాయి వాణిజ్య డిమాండ్‌ను తట్టుకునేలా ఈ మార్కెట్ ఆవిర్భవించబోతోందని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

*జాంబాగ్ నుంచి కోహెడ వరకు.. ఒక సుదీర్ఘ ప్రయాణం
హైదరాబాద్ నగర పండ్ల వ్యాపార ప్రస్థానాన్ని పరిశీలిస్తే జాంబాగ్, గడ్డిఅన్నారం, బాటసింగారం మార్కెట్లు ఒకప్పుడు కీలక పాత్ర పోషించాయి. అయితే కాలక్రమేణా పండ్ల ఉత్పత్తి, రవాణా, వినియోగం ఊహించని పద్ధతిలో పెరిగిపోయాయి. పాత మార్కెట్లలో ఉన్న పరిమిత వసతులు భవిష్యత్ అవసరాలకు ఏమాత్రం సరిపోవని గుర్తించిన ప్రభుత్వం.. రాబోయే రెండు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోహెడలో 239 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ సమగ్ర మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది.
1962లో ఏర్పాటైన మార్కెటింగ్ శాఖ పరిధిలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 79 ఉప మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.80 వేల కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఇప్పుడు కోహెడ ప్రాజెక్టుతో ఈ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక రంగంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. పరిశోధనాత్మక గణాంకాల ప్రకారం, ప్రస్తుత వార్షిక సామర్థ్యం 5.30 లక్షల మెట్రిక్ టన్నుల నుండి ఏకంగా 15.53 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగనుంది. అలాగే, వాణిజ్య పరిమాణ విలువ రూ.1,277 కోట్ల నుండి నేరుగా రూ.7,765 కోట్లకు చేరుకుంటుందని అంచనా. నమోదిత వ్యాపారుల సంఖ్య 341 నుండి 967కు విస్తరించడమే కాకుండా, రోజువారీ వినియోగదారుల సంఖ్య 16,450 నుండి 53,000 పైచిలుకు పెరగనుంది. ఈ గణాంకాలు మార్కెట్ యొక్క అద్భుతమైన సామర్థ్యాన్ని మరియు రాబోయే ఆర్థిక ప్రగతిని స్పష్టం చేస్తున్నాయి.


*కేవలం పండ్లకే పరిమితం కాదు.. ఇదొక సమగ్ర వాణిజ్య కేంద్రం!
కోహెడ మార్కెట్ అనగానే కేవలం పండ్ల క్రయవిక్రయాలే అనుకుంటే పొరపాటే. ఇదొక బహుళార్ధసాధక వాణిజ్య హబ్‌గా రూపుదిద్దుకోనుంది.

 *వైవిధ్యభరిత విభాగాలు: పండ్లతో పాటు పూలు, ఎండిన ఫలాలు (డ్రై ఫ్రూట్స్), పాల ఉత్పత్తులు, శీతలీకృత ఆహార పదార్థాలు (ఫ్రోజన్ ఫుడ్స్), చేపలు, మాంస ఉత్పత్తుల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు.

 *పూల రైతులకు ఊరట: రాష్ట్రంలోని 3,661 మంది పూల రైతులకు మేలు చేకూర్చేలా ఇక్కడ ప్రత్యేక పూల మార్కెట్ అందుబాటులోకి రానుంది.WhatsApp Image 2026-06-05 at 18.40.42

 *ఒకే సూరాని కింద అన్ని సేవలు:పంట నిల్వ, నాణ్యత ఆధారంగా విభజన (గ్రేడింగ్), ప్యాకింగ్, రవాణా సౌకర్యాలు (లాజిస్టిక్స్) వంటివన్నీ ఒకే ప్రాంగణంలో లభిస్తాయి. దీనివల్ల పంట వృథా తగ్గి, రైతుకు దక్కే నికర ఆదాయం పెరుగుతుంది.

*ఆర్థిక భాగస్వామ్యం - పెట్టుబడుల వివరాలు
 ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.3,367.35 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటాగా రూ.2,284.31 కోట్లు పెట్టుబడి పెడుతుండగా, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో మరో రూ.1,083.03 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను సమీకరిస్తున్నారు.

*ఒక చిన్నపాటి నగరంగా కోహెడ ప్రాంగణం!
ఈ మార్కెట్‌ను కేవలం దుకాణాల సముదాయంగా కాకుండా, అన్ని రకాల రక్షణ, అత్యవసర సేవలతో కూడిన ఒక మినీ సిటీ తరహాలో నిర్మిస్తున్నారు. మార్కెట్ ప్రాంగణంలోనే:
 * ప్రత్యేక రక్షకభట నిలయం (పోలీస్ స్టేషన్)
 * అగ్నిమాపక కేంద్రం
 * ఆరోగ్య వైద్యశాల (క్లినిక్)
 * హోటళ్లు మరియు విశ్రాంతి గదులు
 * అత్యాధునిక శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్)

*లక్షలాది మందికి లబ్ధి.. వేలాది మందికి ఉపాధి
ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా తెలంగాణవ్యాప్తంగా ఉన్న సుమారు 1.65 lakhs మంది పండ్ల రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. కేవలం వ్యవసాయ రంగానికే కాకుండా, నిరుద్యోగులకు కూడా ఇదొక పెద్ద వరంగా మారనుంది. ఈ మార్కెట్ ద్వారా ప్రత్యక్షంగా 14 వేల మందికి, పరోక్షంగా రవాణా, ప్యాకింగ్ వంటి రంగాల ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాకుండా, తెలంగాణ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కోహెడ మార్కెట్ ఒక గేమ్ చేంజర్ కాబోతోందని స్పష్టమవుతోంది.WhatsApp Image 2026-06-05 at 18.40.41

About The Author