ఘనంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు....
- విద్యతోనే సామాజిక గుర్తింపు....
- ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ జి.మాధవి....
నాగర్ కర్నూల్ జిల్లా:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో శుక్రవారం నాడు కళాశాల వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు.ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి జి.వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి 100% ఫలితాలు సాధించాలని అన్నారు. ఈనెల 25 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను ప్రతిష్టంగా గుర్తిస్తుందని వచ్చే సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలు వస్త్రాలతో కూడిన కిట్టు ఇచ్చే యోచనాల్లో ఉన్నట్లు తెలిపారు. మధ్యాహ్నం భోజనం పరిశీలనలో ఉందన్నారు. అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ జి.మాధవి మాట్లాడుతూ ఈకళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థితికి చేరుటకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాలని అన్నారు.ఉపాధి దిశగా విద్యనుఅభ్యసించాలన్నారు.విద్యతోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. అనంతరం పరీక్షలలో అధికమార్కుల తెచ్చుకున్న విద్యార్థులకు పథకాలు అందజేశారు.విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం సామూహిక భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో లెక్చరర్లు ఈ.రవిప్రకాష్,హరిత, మహమ్మద్ యునూస్, మంజుల,రాజేశ్వర్, సత్యం,శిరీష,నరేందర్ గౌడ్, నాగరాజు,రాజశేఖర్,రాజేశ్వర్, హిఫ్సా,రాజయ్య,తుకారాం, సిద్ధికి,కిరణ్,కృష్ణయ్య, మంజుల,సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
