ప్రజావాణికి 62 ఫిర్యాదులు*

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వినతుల స్వీకరణ*

ప్రజావాణికి 62 ఫిర్యాదులు*

హైదరాబాద్:

నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు సత్యనారాయణ, రవి కిరణ్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, సిటీ ప్లానర్ శ్రీనివాస్ తదితర విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

అధికంగా ప్రధాన కార్యాలయానికే..
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం *62 ఫిర్యాదులు* నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా ప్రధాన కార్యాలయానికి సంబంధించి 35 వినతులు రాగా, జోన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:
 * *శంషాబాద్ జోన్:* 12
 * *సికింద్రాబాద్ జోన్:* 09
 * *రాజేంద్రనగర్, గోల్కొండ జోన్లు:* చెరి 02
 చార్మినార్, ఖైరతాబాద్ జోన్లు:* చెరి 01

*త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం*
ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత విభాగాల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా భూసేకరణ, పట్టణ ప్రణాళిక (సిటీ ప్లానింగ్), పారిశుధ్యం మరియు ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి, బాధితులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్లు జయంత్, రాజనీకాంత్ రెడ్డి, యూబీడీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, భూసేకరణ విభాగం అధికారిణి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-20 at 19.25.35 (1)

About The Author