డాట్ నెట్ డెవలపర్ల అన్వేషణలో గీతం
పటాన్‌చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అధునాతన సాంకేతిక పరిష్కారాల కేంద్రం (CATS) అనుభవజ్జులైన డాట్ నెట్ డెవలపర్ల కోసం నియామక ప్రక్రియ ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2026 జూన్ 13, 14 తేదీలలో జరిగే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనవలసిందిగా కోరుతూ సోమవారం ఒక ప్రకటనను వెలువరించింది.
పటిష్టమైన సాఫ్ట్ వేర్ సొల్యూషన్ల రూపకల్పన, అభివృద్ధి, అమలు చేయడంలో 3 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రతిభావంతులైన నిపుణుల కోసం విశ్వవిద్యాలయం అన్వేషిస్తోందని తెలిపారు. అభ్యర్థులకు ASP.NET, MVC, .NET కోర్, వెబ్ API, and SQL సర్వర్ డేటాబేస్ టెక్నాలజీలలో బలమైన సాంకేతిక నైపుణ్యం ఉండాలని స్పష్టీకరించారు.
అభ్యర్థి అనుభవం, నైపుణ్యాలు, ఆయా పోస్టులకు అనుగుణంగా వారు ఒడుపుగా వ్యవహరించే విధానాన్ని అనుసరించి వార్షిక వేతన ప్యాకేజీ 3.5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు, లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అసాధారణ ప్రతిభ ఉన్న వారికి, వారి యోగ్యత, నైపుణ్యం ఆధారంగా అధిక వేతనం అందిస్తామని తెలిపారు.
ఈ నియామక కార్యక్రమం, అత్యంత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ వర్క్ ఫోర్సును నిర్మించడానికి, CATS వ్యవస్థను బలోపేతం చేయడానికి గీతం యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
