తెలంగాణ జర్నలిస్టు సంఘాల - జేఏసీ రాష్ట్ర కో...కన్వీనర్ గా సీనియర్ పాత్రికేయులు- కందుకూరి యాదగిరి నియామకం

WhatsApp Image 2025-12-28 at 4.25.15 PM

సూర్యాపేట : 

తెలంగాణ జర్నలిస్టు సంఘాల జేఏసీ రాష్ట్ర కో...కన్వీనర్ గా సూర్యాపేట జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయులు కందుకూరి యాదగిరి నియామకం అయ్యారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో యాదగిరి కి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆనించిన్ని వెంకటేశ్వర్లు,ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు లు మాట్లాడుతూ యాదగిరి గత నాలుగు సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి జర్నలిస్టుల అభివృద్ధి కోసం కృషి చేయడం అభినందనీయం అని తెలిపారు. ఆయన అసోసియేషన్ ద్వారా చేపట్టిన అన్ని కార్యక్రమాలను చూస్తున్నామని తెలిపారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ జేఏసీ ఎప్పుడు ఎలాంటి పిలుపునిచ్చిన తాము అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటామని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.. 

About The Author