ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణకు సన్మానం
గజ్వేల్
గజ్వేల్‌లో ఆదివారం ఆర్యవైశ్య మహాసభ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అండగా మహాసభ నిలుస్తుందని, వివిధ సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవలందిస్తున్నామని తెలిపారు. “సేవకు ప్రతిరూపం ఆర్యవైశ్య మహాసభ” అని పేర్కొన్నారు.మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం డైరెక్టర్, మండల అధ్యక్షులు జగ్గ్యాయగారి శేఖర్, పట్టణ అధ్యక్షులు అత్తెల్లి శ్రీనివాస్, గోలి సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి గజ్వేల్‌కు రావడంతో సన్మానం నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంప శ్రీనివాస్, అయిత రత్నాకర్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
