
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనపై రేపటి (10.11.2025) నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిడిఎస్ అధికారులు బృందాలుగా ఏర్పడి, జిల్లాలోని వివిధ ప్రాంతాలలో బాల్య వివాహాల అనర్థాలు, నిర్మూలన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 14వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 18 వ తేదీన గ్రామాలలో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తారని వివరించారు. 20వ తేదీ నుంచి డివిజన్ల వారీగా, వివాహ ఆహ్వాన పత్రికల ప్రింటింగ్ ప్రెస్, డీజే యజమానులు, పూజారులు, పాస్టర్లు, ఖాజీలతో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. డిసెంబర్ ఒకటవ తేదీ వరకు వివిధ కార్యక్రమాల రూపేనా జిల్లా ప్రజల్లో బాల్యవివాహాల నిర్మూలలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సంపూర్ణంగా బాల్యవివాహాలను అరికట్టేలా చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.