బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్.. అవినీతికి అడ్డా!

​సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: యువమోర్చా నేత రామిడి శూరకర్ణ రెడ్డి డిమాండ్

బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్.. అవినీతికి అడ్డా!

బడంగ్‌పేట: 
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి నిలయంగా మారిందని, ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిడి శూరకర్ణ రెడ్డి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నా యంత్రాంగంలో మార్పు రావడం లేదని విమర్శించారు.

​అవినీతి అధికారులకే ప్రమోషన్లా?
​గతంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి, అవినీతి అధికారులను జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయని శూరకర్ణ రెడ్డి గుర్తు చేశారు. అయితే, ఏసీబీకి దొరికిన అధికారులకే తిరిగి పదోన్నతులు కల్పించడం వల్ల అవినీతి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

​ఆరేళ్లుగా అక్రమాల పర్వం:
​గడిచిన ఆరేళ్ల కాలంలో కార్పొరేషన్ పరిధిలో భారీగా అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా:
​ప్రభుత్వ స్థలాలు, పార్కులు, కుంటలు, చెరువుల కబ్జా.
​అక్రమ ఎల్ఆర్ఎస్ (LRS), దొంగ డోర్ నంబర్ల కేటాయింపు.
​సాధారణ బడ్జెట్ నిధుల దారి మళ్లింపు.
​వీటన్నింటిపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

​కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే!
​అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని శూరకర్ణ రెడ్డి విమర్శించారు. "అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని, బాధ్యులను జైలుకు పంపిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. రెండేళ్లు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ రెండు పార్టీల నాయకులు కుమ్మక్కై అవినీతిలో పాలుపంచుకుంటున్నారు" అని ధ్వజమెత్తారు. నిన్న బడంగ్‌పేట సర్కిల్‌లో ఏసీబీ అధికారులు జరిపిన దాడులే ఇక్కడి అక్రమాలకు నిదర్శనమని, ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆయన కోరారు.

About The Author