ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్
- దేశంలోని అన్ని ఐఐటీలకు చెందిన 2500 మంది విద్యార్థులు హాజరు
- నాలుగు రోజులపాటు కొనసాగనున్న క్రీడలు

సంగారెడ్డి : :
సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్ కంది క్యాంపస్ లో 58 వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని బ్యాట్మెంటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రారంభించారు. ఇందులోముఖ్య అతిథులుగా బ్యాట్మెంటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్, ఐఐటి హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.... మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం క్రీడలు ఆడాలన్నారు. అప్పుడే చదువుల్లోనూ రాణించగలుగుతారన్నారు. శారీరక ఆరోగ్యానికి పోషక ఆహారాన్ని తీసుకుంటేనే శరీరం దృఢంగా ఉంటుందని అన్నారు.ఇష్టమైన క్రీడల్లో సామర్థ్యాలను పెంపొందించుకుంటూ రాష్ట్రం దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా ముందుకెళ్లాలన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్స్ లో దేశంలోని అన్ని ఐఐటీలకు చెందిన 2500 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరచానున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. నాలుగు రోజుల పాటు సాగే స్పోర్ట్స్ మీట్లో ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ నిర్వహించడం తోపాటు పోటీలలో నెగ్గిన వారికి బహుమతులు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటి ప్రొఫెసర్లు నిర్వాహకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
