అంగరంగ వైభవంగా రామానుజన్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు

ఉమ్మడి వరంగల్ బ్యూరో:

WhatsApp Image 2025-09-21 at 3.03.22 PM

మా శ్రీనివాస రామానుజన్ ఒ లంపియాడ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించుకుంటున్నామని స్కూల్ డైరెక్టర్ లయన్ ముచ్చ రాజిరెడ్డి, సెక్రటరీ, కరస్పాండెంట్ ముచ్చ అరుణ రాజిరెడ్డి లు అన్నారు. చదువుతోపాటు బతుకమ్మ సంబరాలు విద్యార్థినీ విద్యార్థులు,పేరెంట్స్ తో పాటు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని, చదువుతోపాటు సంస్కృతి నేర్పించడం కూడా మా యొక్క ఉద్దేశమని, రకరకాల పూలు సేకరించి బతుకమ్మ పేర్చడం, పాటలు ఆటలతో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిభ కనబరిచిన పేరెంట్స్, విద్యార్థిని విద్యార్థులకు నైపుణ్యం గుర్తించి అవార్డ్స్ కూడా ఇస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Read More రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా..?

About The Author