బీసీలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి : మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు.
నాగోల్ :
మన ఆలోచన సాధన సమితి (మాస్) ప్రధాన కార్యాలయంలో రజక,ముదిరాజ్, విశ్వకర్మ, మేర, కులాలకు సంబంధించిన ప్రతినిధులకు 'మాస్ లీడర్ షిప్ ప్రోగ్రాం నిర్వసించారు 'మాస్ కోశాధికారి శ్రీ పెద్ద వూర బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన మాస్ లీడర్ షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కటకం నర్సింగ్ రావు, అతిథులుగా, ముదిరాజ్ మహా సభ అధ్యక్షులు పాల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్. అల్లదుర్గం సురేష్ ముదిరాజ్, ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ చీరాల జేలేంద్ర చారి,తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షత వహిస్తున్న పెద్ద వూర బ్రహ్మయ్య రజక మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు గారి ఆలోచన నుండి పుట్టిన మన ఆలోచన సాధన సమితి చేసిన కార్యక్రమాలను వివరించి, బీసీలలో నాయకత్వ లోపం ఉన్న దృష్ట్యా, బీసీ కులాలు అనుచరులుగా కాకుండా నాయకులుగా ఎదగాల్సిన ఆవశ్యకత గుర్తించి మాస్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం కు అతిథులుగా పాల్గొన్నటువంటి వక్తలు బీసీల నాయకత్వ లేమి వలన భూస్వాములు, పెట్టుబడి దారులుగా ఉన్నటువంటి ఆధిపత్య కులాలు వివిధ వ్యాపారాల మాదిరిగానే రాజకీయాలను కూడా మార్చుకుని మన బీసీలను ఓట్లను వేసే యంత్రాలుగా, ఓట్లమ్ముకునే వారిగా, ఓట్లను వేయించే అనుచరులుగా మార్చుకుని మనల్ని పాలిస్తూ ప్రభుత్వ వ్యవస్థలను గుప్నిట్లో పెట్టుకుని రాజకీయ దోపిడీకి పాల్పడుతూ సమాజంలో ఎక్కువగా ఉన్న బీసీ లకు అందాల్సిన ప్రతిఫలాలను కొల్లగొడుతూ అన్యాయం చేస్తున్నారని, ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే మన జాతులు విద్యను, చైతన్యాన్ని ఆయుధంగా మలచుకుని నాయకత్వాన్ని పెంపొందించుకుందామని, కులాలుగా వేరు వేరు గా ఉన్న మనం బీసీలుగా ఐక్యతను పెంపొందించుకుందామని పిలుపునిచ్చారు. అలాగే కులవృత్తులు, వ్యాపారాలలో ఉన్నటువంటి బీసీ కులాలను ప్రోత్సహించుకుందాం, ఆర్థికంగా ఎదగడానికి ఊతమివ్వడం ద్వారా మనమందరం ఒకటే అనే భావన కలిగిద్దామని తెలిపారు.
పూర్వం గ్రామీణ వ్యవస్థలో బీసీ కులాల మధ్యన కుటుంబ సంబంధాలు, చుట్టరికపు అనుబంధాలు కలిగి వరుసలు పెట్టి పిలుచుకునే సంస్కృతి ఉండెడిది.అటువంటి ఐక్యత ఉన్న కులాల మధ్యన రాజకీయ పార్టీలు చొరబడి, కులాల మధ్యన విభజన చేసి పార్టీల కార్యకర్తలుగా మనల్ని మార్చుకుని ఒకొక్క పార్టీ కోసం, ఆయా పార్టీల నాయకుల కోసం బట్టలు చింపుకునే బానిసలుగా తయారు చేసుకుని మందు, విందుకు అలవాటు చేసి ఏ వృత్తి నైపుణ్యత పెంచుకోకుండా తమ వెంట తోకాడించుకుంటూ తిరిగేలా చేసుకుని మనల్ని నాయకులుగా ఎదగాలనే ఆలోచనలు కూడా మనకు రాకుండా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నాయని, మనం ఇప్పటికైనా మేల్కొని ఈ పరిస్థితుల నుండి అధిగమించి నాయకులుగా ఎదగాలనే తపనను పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.
వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు గారు మాట్లాడుతూ మన ఆలోచన సాధన సమితి అనేది ఒక సంస్థ కాదు, ఒక బీజం,ఒక భావజాలం, ఒక ఉద్యమం, ఒక ఉప్పెనలా ప్రభంజనం సృష్టించడానికి బీసీ నాయకుల సైన్యాన్ని తయారు చేస్తుందని, అందులో భాగంగానే బీసీ కులాల లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం లు అని వివరించారు. యువత పార్టీల మోజులో, మతం మోజులో, ఇతర వ్యసనాల మోజులో పడి నాయకత్వం వహించడానికి ముందుకు రాకపోవడం వలననే బీసీ ఉద్యమాలు ఎగసిపడడం లేదని, అటువంటి యువతలో చైతన్యం తీసుకుని వచ్చి బీసీ భావజాలం వ్యాప్తి ద్వారా నాయకులుగా తీర్చి దిద్దడమే మన ఆలోచన సాధన సమితి లక్ష్యం అని ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం జక్కుల బాలరాజు యాదవ్,ముగింపు సందేశం శ్రీ శ్రీగాది కృష్ణయ్య గారు,ఉపాధ్యక్షులు గూండ్ల ఆంజనేయులు గౌడ్, ప్రధాన కార్యదర్శి బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్ కన్వీనర్లుగా వ్యవహరించిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం లో మాస్ అధికార ప్రతినిధి మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర, ప్రచార కార్యదర్శి, సోషల్ మీడియా ఇన్చార్జి కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర,ప్రచార కార్యదర్శి దువ్వల శ్రీకాంత్ గంగపుత్ర , సుంచు వాసు, నిమ్మల సత్యం రజక, దండెనబోయిన భరద్వాజ్ ముదిరాజ్, సామ పృథ్వీరాజ్ ముదిరాజ్, కార్యదర్శి అమృతం మార్కండేయులు , వివిధ బీసీ కులాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
