
సూర్యాపేట :
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతనంగా నియామకమైన వైద్యాధికారులకు సూచించారు.పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నియామకం అయిన వైద్యాధికారులు డాక్టర్ ఎస్ సాయి కృష్ణ,డాక్టర్ యన్ అమూల్య, డాక్టర్ బి ప్రణీత్ నాయక్,డాక్టర్ ప్రతిమలకు నియామక పత్రాలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్,ఎస్పి కే నరసింహ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్,తదితరులు హాజరయ్యారు..