పోలంపల్లి లో సైకిల్ల పంపిణి

కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నాయకులు

WhatsApp Image 2025-11-12 at 6.48.00 PM

కరీంనగర్ : 

Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ

పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు కేంద్ర మంత్రి  బండి సంజయ్ ఉచితంగా ఇస్తున్నటువంటి సైకిల్ లను బుధవారం పోలంపల్లి పాఠశాలలో పంపిణి చేసారు. స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో 
బిజెపి మండల అధ్యక్షులు జగదీశ్వర చారి మాట్లాడుతూ సైకిల్ లే కాకుండా 10 వ తరగతి వారి పరీక్ష ల ఫీజు లను కూడా కేంద్ర మంత్రే చెల్లించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. సైకిల్ లతో పాటుగా విద్యార్థుల పరీక్ష ఫీజులను చెల్లిస్తున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంచార్జ్ మండల విద్యాధికారి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు  కరుణాకర్, ఉపాధ్యాయ సిబ్బంది, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు వొద్నాల రవీందర్,పడాల శ్రీనివాస్ గౌడ్,పడాల సారయ్య, రాపర్తి రవీందర్, బుడిగే మహేష్,బుడిగే నరేష్, కాశవేణి రాజు,పచ్చిమట్ల మల్లయ్య, పడాల తిరుపతి,రేగూరి సుగుణాకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రెడ్డి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Read More కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాలలో విజయం సాధిస్తారు

About The Author