ఆశీర్వదించండి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా..
- కుభీర్ సర్పంచ్ అభ్యర్థి సమీనాఖానం ముజాహిద్ ఖాన్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
కుభీర్ లో ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థి సమీనాఖానం ముజాహిద్ఖాన్ గ్రామప్రజలు ఆశీర్వదించి రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే కుభీర్ పంచాయతీని జిల్లాలోనే ఆదర్శ పంచా యతీగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ నారాయణావుపాటిల్వ ర్గం బల పరిచిన అభ్యర్థి సమీనాఖానం ముజాహిదాఖాన్ అన్నారు. ముఖ్యంగా గ్రామంలోని నయాబాదీ కాలనీలో ఇళ్లపై నుంచి వెళ్తున్న 11కేవీ విద్యుత్ లైన్ తొలగింపు, ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు, ప్రసవాలు, జరిగేలా స్థా యిని పెంచి 50పడకల ఆసుపత్రిగా మారుస్తానని, వర్షాకాలం శ్రీ విఠలేశ్వ రస్వామి ఆలయంలోకి వరద నీరు చేరుకుండా అందరితో చర్చించి ప్రత్యేక ప్రణాళికలతో చర్యలు చేపడతానని, రైతు సోదరులు ఎదుర్కొంటున్న వ్యవ సాయ అంతర్గత రహదారులను సమస్య పరిష్కరించి రైతులకు అండగా నిలుస్తానని, శ్మశాన వాటిక అభివృద్ధి చేసి కావాల్సిన వసతులు కల్పిస్తామన్నారు.
యువత కోసం మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని, గ్రామంలో మై నార్టీ సోదరుల కోసం షాదీఖానా నిర్మాణం చేపడతాని, కాంగ్రెస్ పార్టీ, ప్ర వేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా కృషి చేస్తా నని అంటూ తమ ఎజెండాను ఓటర్లకు వివరిస్తూ తమ ప్రధాన అనుచరులు తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తమ అమూల్యమైన ఓటు రిమోట్ గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
